Project k : హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్

ABN , First Publish Date - 2021-12-04T21:40:54+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల లిస్ట్‌లో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. ‘మహానటి’ తో దర్శకుడిగా తన టాలెంట్ ఎలాంటిదో చాటిచెప్పిన నాగ్ అశ్విన్.. ఈ సినిమాకి దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. కథానాయికగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణే ఎంపికవడంతో మరింతగా ఆసక్తి నెలకొంది.

Project k : హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల లిస్ట్‌లో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. ‘మహానటి’ తో దర్శకుడిగా తన టాలెంట్ ఎలాంటిదో చాటిచెప్పిన నాగ్ అశ్విన్.. ఈ సినిమాకి దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. కథానాయికగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణే ఎంపికవడంతో మరింతగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. అయితే తాజా షెడ్యూల్ రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. 


అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడెకరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరణ మొదలు కాబోతోంది. ఈ షెడ్యూల్ లో దీపికా పదుకొణే జాయిన్ కాబోతోంది. ఈ క్రమంలో దీపికాను వెల్ కమ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ మేకర్స్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. వైజయంతి వారి బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ‘ప్రాజెక్ట్ కె’ నిలిచిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కాబోతున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం ప్రభాస్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.

Updated Date - 2021-12-04T21:40:54+05:30 IST