Chiranjeevi: 'గాడ్ ఫాదర్' నిర్మాతలు.. క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి!

ABN , First Publish Date - 2022-09-25T19:00:07+05:30 IST

అక్టోబర్ 5 కోసం మెగా అభిమానులు(Mega Fans) ఆశగా ఎదురుచూస్తున్నారు. కారణం.. ఆ రోజే మెగాస్టార్ (Megastar) 'గాడ్ ఫాదర్ (godfather)' చిత్రం రిలీజ్‌కి సిద్ధమయ్యింది...

Chiranjeevi: 'గాడ్ ఫాదర్' నిర్మాతలు.. క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి!

అక్టోబర్ 5 కోసం మెగా అభిమానులు(Mega Fans) ఆశగా ఎదురుచూస్తున్నారు. కారణం.. ఆ రోజే మెగాస్టార్ (Megastar) 'గాడ్ ఫాదర్ (godfather)' చిత్రం రిలీజ్‌కి సిద్ధమయ్యింది. మరి ఈ సినిమా పరిస్థితేంటి?. మేకర్స్ నమ్మకంగా చెబుతున్నట్టు  'గాడ్ ఫాదర్' రికార్డులెక్కుతాడా?  అన్న చర్చ జరుగుతోంది. సెన్సార్ రిపోర్ట్ బావుంది అంటూ సోషల్ మీడియాలో  వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 


అయితే సినిమా గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్ వరకూ ఆశించిన స్థాయిలో లేవు అని విమర్శలు ఉన్నాయి. ఆచార్య పరాజయమో.. లూసిఫర్  తెలిసిన కథ కావడమో.. గాడ్ ఫాదర్‌పై  మొదటి నుంచి భారీ అంచనాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఒక తెలుగు భాషలోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సరే, మంచి కథ కాబట్టి.. అక్కడ ఏమో.. గుర్రం ఎగరావచ్చు అనుకోవచ్చు. కానీ, మలయాళంలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకోవడమే చాలా ఆశ్చర్యకరం. అసలు ఈ సినిమా.. మలయాళ 'లూసిఫర్'' సినిమాకి పక్కా రీమేక్.  పైగా అక్కడ  సూపర్ స్టార్ 'మోహన్ లాల్' సంపూర్ణంగా నటించి అద్భుతంగా మెప్పించిన కథ ఇది. దీనికి తోడు మలయాళ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది లూసిఫర్. మరి విచిత్రంగా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని మలయాళంలో ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? ఆల్ రెడీ ఎప్పుడో చూసేసిన కథను, ఇప్పుడు మళ్లీ చూపించడం ఎందుకు? అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మలయాళీలకు  బాగా తెలిసిన 'గాడ్ ఫాదర్' చిత్రం పై వారెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? అని కూడా ట్రోల్ చేస్తున్నారు. 

Updated Date - 2022-09-25T19:00:07+05:30 IST