‘బుల్లెట్టు బండి’: పెద్ద పెద్ద ఆఫర్లు!
ABN , First Publish Date - 2021-09-24T22:39:22+05:30 IST
గత నాలుగు నెలలుగా గమనిస్తే ఏ వేడుకలో చూసినా, వేదిక ఏదైనా వినిపించే పాట మాత్రం ఒక్కటే! పెళ్లి, బరాత్, సంగీత్, వినాయక మండపాలు ఎక్కడ చూసినా హవా బుల్లుట్లు బండిదే! ‘మనోహరి’, ‘రెడ్డమ్మ తల్లి’, ‘మగువా మగువా’, ‘భలే భలే మగడివోయ్’ ‘నాలో మైమరపు’ ‘మహానటి’ వంటి చిత్రాల్లో సూపర్‌హిట్ పాటలు పాడిన మోమన భోగరాజు పాడిన పాట ఇది.

గత నాలుగు నెలలుగా గమనిస్తే ఏ వేడుకలో చూసినా, వేదిక ఏదైనా వినిపించే పాట మాత్రం ఒక్కటే! పెళ్లి, బరాత్, సంగీత్, వినాయక మండపాలు ఎక్కడ చూసినా హవా బుల్లుట్లు బండిదే! ‘మనోహరి’, ‘రెడ్డమ్మ తల్లి’, ‘మగువా మగువా’, ‘భలే భలే మగడివోయ్’ ‘నాలో మైమరపు’ ‘మహానటి’ వంటి చిత్రాల్లో సూపర్‌హిట్ పాటలు పాడిన మోహన భోగరాజు పాడిన పాట ఇది. లాక్డౌన్లో ఖాళీగా ఉన్న సమయంలో వచ్చిన ఐడియాతో సింగర్ మోహనా ఈ ప్రయత్నం చేశారు. పెళ్లై అప్పగింతల సందర్భంలో అమ్మాయి ఊహించుకుంటూ పాడుకునే పాట ఇది. లక్ష్మణ్ సాహిత్యం, ఎస్కె బాజీ సంగీతంలో ఏప్రిల్‌లో విడుదలైన ఈ పాట చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ స్టెప్పులు వేయించే ఊపు తీసుకొచ్చింది. ఇప్పటికే 92 మిలియన్లకు పైగా వ్యూయర్స్‌ను సొంతం చేసుకుందీ పాట.
అంతే కాదు.. ఆ క్రేజ్‌తోపాటు బడా దర్శకనిర్మాతల కన్నూ ఈ పాటపై పడింది. ఫోక్ సాంగ్‌లకు క్రేజ్ పెరుగుతున్న తరుణంలో బుల్లెట్ బండి రైట్స్ కోసం ఎగబడుతున్నారు. తమ చిత్రాల్లో ఈ పాటను పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నాలో ఉన్నారు. ఇప్పటికే పలు ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి గాయని మోహనకు ఫోన్ కాల్స్ వరుస కట్టాయి. కానీ ఆమె రైట్స్ ఇచ్చేందుకు సుముఖంగా లేరని తెలిసింది. ఎంతో కష్టపడి చేసిన ఆ పాటను తన ఛానల్లో ఓ మంచి జ్ఞాపకంగా ఉండిపోవాలని ఆమె కోరుకుంటున్నారు. ప్రస్తుతం మోహన మరో బుల్లెట్‌లాంటి పాట వదిలే ప్రయత్నాల్లో ఉన్నారు.
