జీవితను వద్దన్నందుకు.. రాజశేఖర్‌నే తీసేశారట!

ABN , First Publish Date - 2020-12-17T18:35:47+05:30 IST

‘మాకు ఆ హీరోయిన్ వద్దు.. ఈ హీరోయిన్ వద్దు..’ అంటూ హీరోలు చెప్పడం.. అందుకు అనుగుణంగా డైరెక్టర్లు, నిర్మాతలు కూడా హీరోయిన్లను మార్చడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంపై అనేకమంది హీరోయిన్లు...

జీవితను వద్దన్నందుకు.. రాజశేఖర్‌నే తీసేశారట!

ఇంటర్నెట్ డెస్క్: ‘మాకు ఆ హీరోయిన్ వద్దు.. ఈ హీరోయిన్ వద్దు..’ అంటూ హీరోలు చెప్పడం..  అందుకు అనుగుణంగా డైరెక్టర్లు, నిర్మాతలు కూడా హీరోయిన్లను మార్చడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంపై అనేకమంది హీరోయిన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలూ లేకపోలేదు. అయితే ఓ హీరోయిన్‌ను వద్దన్నందుకు ఏకంగా హీరోనే మార్చేసిన ఘటన ఎక్కడైనా చూశారా.. అవును అలాంటి సంఘటనే సీనియర్ హీరో రాజశేఖర్‌కు ఎదురైంది. సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ చక్కటి జంట.. జీవిత-రాజశేఖర్. అనేక చిత్రాల్లో హిట్ పెయిర్ అనిపించుకుని, ఆ తరువాత ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. వీరిద్దరూ తమిళనాడుకు చెందిన నటులే. అయినప్పటికీ తెలుగులో మంచి గర్తింపు పొందారు.


తెలుగులో వీరిద్దరూ నటించిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే రాజశేఖర్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో జీవితను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్మాతలు అనుకున్నారట. కానీ దీనికి రాజశేఖర్ అంగీకరించలేదు. సినిమాలో హీరోయిన్‌ది బబ్లీగా, గ్లామరస్‌గా ఉండే పాత్ర అని, అలాంటి పాత్రలో హోమ్లీగా ఉండే జీవిత సరిపోదని నిర్మాతలకు రాజశేఖర్‌ సూచించారట. దానికి దర్శక, నిర్మాతలు కూడా సరేనని చెప్పి రాజశేఖర్‌ను పంపించేశారట.


4 రోజుల్లో షూటింగ్ మొదలు కావల్సి ఉండగా.. 10 రోజులైనా అవతలి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిర్మాతలకు ఫోన్ కూడా చేశారట. కానీ అవతలి వారి కనీసం ఫోన్ లిఫ్ట్ చేసిన పాపాన కూడా పోలేదట. చివరకు సినిమాలో తననే మార్చేశారని, హీరోగా వేరేవారిని తీసుకున్నారని తెలిసి రాజశేఖర్‌ షాక్ తిన్నారట. అయితే ఆ తరువాత జీవిత, రాజశేఖర్.. ఇద్దరూ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడం, ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది.

Updated Date - 2020-12-17T18:35:47+05:30 IST