Director - Producer:ఇదేమి చోద్యం...త‌న ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌రే క‌మీష‌న్ నొక్కేసిన నిర్మాత‌

ABN , First Publish Date - 2021-07-28T21:19:18+05:30 IST

మ‌న అనుకున్న‌వాళ్లే మ‌న ద‌గ్గ‌ర చేతివాటం చూపించార‌ని తెలిస్తే మ‌న‌సుకి క‌లిగే బాధ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ ద‌ర్శ‌కుడు అలాగే బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. ఒకానొక సంద‌ర్భంలో ఓ నిర్మాతతో కలిసి పెద్ద ఇండ‌స్ట్రీ హిట్‌నే ఇచ్చాడు. ఇప్పుడు మ‌రోసారి అదే హీరోతో సినిమా చేయ‌బోతున్నాడు.

Director -  Producer:ఇదేమి చోద్యం...త‌న ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌రే క‌మీష‌న్ నొక్కేసిన నిర్మాత‌

మ‌న అనుకున్న‌వాళ్లే మ‌న ద‌గ్గ‌ర చేతివాటం చూపించార‌ని తెలిస్తే మ‌న‌సుకి క‌లిగే బాధ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ ద‌ర్శ‌కుడు అలాగే బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. అగ్ర హీరోలు, అప్ క‌మింగ్ హీరోల‌తో సినిమాలు చేసిన ఈ ద‌ర్శ‌కుడు ఒకానొక సంద‌ర్భంలో ఓ నిర్మాతతో కలిసి పెద్ద ఇండ‌స్ట్రీ హిట్‌నే ఇచ్చాడు. ఇప్పుడు మ‌రోసారి అదే హీరోతో సినిమా చేయ‌బోతున్నాడు. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉంది. ఈ డైరెక్ట‌ర్ అప్పుడెప్పుడో సిటీకి దూరంగా కొంత భూమిని కొనుగోలు చేశాడ‌ట‌. అది కూడా రియ‌ల్ ఎస్టేట్ చేసే ఓ నిర్మాత ద‌గ్గ‌రే ఆ భూమిని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ భూమిని ఆమ్ముకోవాల‌ని అనుకున్నాడు. త‌న‌తో భూమిని కొనిపించిన తన నిర్మాత‌కే భూమిని అమ్మి పెట్ట‌మ‌ని చెప్పాడు. అందుకు కార‌ణం, వేరే వాళ్ల‌యితే క‌మీష‌న్, గ‌ట్రా ఇవ్వాల్సి ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు భావించాడు. 


అయితే స‌ద‌రు నిర్మాత న‌మ్మిన ద‌ర్శ‌కుడికే షాక్ ఇచ్చాడ‌ట‌. ద‌ర్శ‌కుడి భూమిని రీజ‌న‌బుల్ రేటుకే అమ్మిన నిర్మాత‌.. త‌న లాభాన్ని క‌మీష‌న్ రూపంలో దండుకున్నాడ‌ట‌. ఈ విష‌యం అటు ఇటు తిరిగి భూమిని అమ్మిన ద‌ర్శ‌కుడికి తెలిసింది. దీంతో ఆ ద‌ర్శ‌కుడు ఫీల‌య్యాడట‌. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేసే అవ‌కాశాలున్నాయ‌ని కూడా ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు మ‌రా ప్రాజెక్ట్ ముందుకెళుతుందో లేదో మ‌రి చూడాలి. 

Updated Date - 2021-07-28T21:19:18+05:30 IST