Harnaaz Sandhu: మిస్ యూనివర్స్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన నిర్మాత

ABN , First Publish Date - 2022-08-05T22:21:11+05:30 IST

పంజాబీ ముద్దుగుమ్మ హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) మిస్ యూనివర్స్-2021 టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 21ఏళ్ల తర్వాత ఆమె ఈ కిరీటాన్ని భారత్‌కు అందించింది.

Harnaaz Sandhu: మిస్ యూనివర్స్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన నిర్మాత

పంజాబీ ముద్దుగుమ్మ హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) మిస్ యూనివర్స్-2021 టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 21ఏళ్ల తర్వాత ఆమె ఈ కిరీటాన్ని భారత్‌కు అందించింది. హర్నాజ్‌కు వ్యతిరేకంగా పంజాబ్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంట్రాక్ట్‌ను ధిక్కరించిందనే కారణంతో నటి, నిర్మాత ఉపాసన సింగ్ (Upasana Singh)ఈ పిటిషన్ వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. 


హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకోక మందే ఓ సినిమా చేసింది. ‘బాయి జీ కుట్టాంగే’ (Bai ji Kuttange)పంజాబీ చిత్రంలో నటించింది. ఈ సినిమాకు ఉపాసన సింగ్ నిర్మాతగా వ్యవహరించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కానీ, మూవీ ప్రమోషన్స్‌కు హర్నాజ్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఉపాసన కోర్టులో పిటిషన్ వేసింది.‘‘కాంట్రాక్ట్ ప్రకారం చిత్ర ప్రమోషన్స్‌కు వ్యక్తిగతంగా, వర్చువల్‌గా హర్నాజ్ అందుబాటులో ఉండాలి. కానీ, సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె డేట్స్ ఇవ్వడం లేదు. మిస్ యూనివర్స్‌గా కిరీటాన్ని కైవసం చేసుకోక ముందే ఈ చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చాను. ఈ సినిమాపై భారీగా వెచ్చించాను. చిన్న చిత్రం ఏ మాత్రం కాదు. మే 27నే మూవీ విడుదల కావాలి. కానీ, హర్నాజ్ ప్రమోషన్స్‌కు డేట్స్ ఇవ్వడం లేదు. అందువల్లే విడుదల తేదీని ఆగస్టు 19కి మార్చాం’’ అని ఉపాసన సింగ్ చెప్పింది. ‘కపిల్ శర్మ షో’లో కపిల్ శర్మకు అత్తగా ఉపాసన సింగ్ కనిపిస్తుంటుంది. ‘బాయి జీ కుట్టాంగే’ కు స్మీప్ కాంగ్ (Smeep Kang) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో దేవ్ ఖరౌద్, గురుప్రీత్ ఘుగీ కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-08-05T22:21:11+05:30 IST