నిర్మాత ఆర్‌ఆర్‌ వెంకట్‌ ఇకలేరు

ABN , First Publish Date - 2021-09-28T05:15:00+05:30 IST

నిర్మాత ఆర్‌ఆర్‌ వెంకట్‌ సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు...

నిర్మాత ఆర్‌ఆర్‌ వెంకట్‌ ఇకలేరు

నిర్మాత ఆర్‌ఆర్‌ వెంకట్‌ సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెంకట్‌ అసలు పేరు జె.వి. వెంకట్‌ ఫణీంద్రరెడ్డి. ఆయన వయసు 57 ఏళ్లు. ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై నాగార్జున, మహేశ్‌బాబు, రవితేజ, నితిన్‌, నాగచైతన్య వంటి అగ్ర హీరోలతో పలు చిత్రాలు నిర్మించారు.


‘ది ఎండ్‌’ చిత్రంతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించిన ఆయన... ‘సామాన్యుడు’, ‘విక్టరీ’, ‘మాయాజాలం’, ‘హంగామా’, ‘గుండమ్మగారి మనవడు’, ‘బహుమతి’ చిత్రాలు నిర్మించారు. ‘కిక్‌’తో భారీ చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ‘ప్రేమ కావాలి’, ‘డాన్‌ శీను’, ‘మిరపకాయ్‌’, ‘బిజినె్‌సమేన్‌’, ‘పూలరంగడు’, ‘లవ్లీ’, ‘డమరుకం’ తదితర విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఇంగ్లి్‌షలో ‘డివోర్స్‌ ఇన్విటేషన్‌’, హిందీలో ‘ఏక్‌ హసీనా థి’, ‘జేమ్స్‌’ చిత్రాలకు ఆయనే నిర్మాత. తాను నిర్మించిన ప్రతి సినిమా ఆడియో వేడుకలో పేదలకు, ఆపదలో ఉన్నవారికి, సేవాసంస్థలకు వెంకట్‌ రూ. ఐదు లక్షలు సాయంగా అందజేసేవారు. ఏం చేసినా ప్రచారానికి దూరంగా ఉండటం ఆయన నైజం. కనీసం తన ఫొటో కూడా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకునేవారు.

Updated Date - 2021-09-28T05:15:00+05:30 IST