ప్రొడ్యూసర్‌, పోలీసాఫీసర్‌

ABN , First Publish Date - 2022-12-03T06:42:36+05:30 IST

ఎంతటి కష్టసాధ్యమైన పాత్రయినా తనదైన శైలిలో పండించడం నానికి కొట్టినపిండి. ఈసారి ఆయన ఒకే చిత్రంలో రెండు పాత్రలు పోషించబోతున్నారు...

ప్రొడ్యూసర్‌, పోలీసాఫీసర్‌

ఎంతటి కష్టసాధ్యమైన పాత్రయినా తనదైన శైలిలో పండించడం నానికి కొట్టినపిండి. ఈసారి ఆయన ఒకే చిత్రంలో రెండు పాత్రలు పోషించబోతున్నారు ఒకటి తెరపైన హీరోగా, రెండోది తెరవెనుక నిర్మాతగా. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు నాని. ఆ కోవలో వచ్చిన ‘హిట్‌ 2’ ఇటీవలె విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచీ ‘హిట్‌ 3’లో హీరో ఎవరనే విషయం పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ‘హిట్‌ 2’ రిలీజ్‌తో ఆ సస్పెన్స్‌ వీడింది. ఇందులో నాని కథానాయకుడిగా నటించబోతున్నారు. ‘హిట్‌ 2’ చిత్రం ముగింపులో ఆయన పోలీసాఫీసరు పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. నాని పాత్రను పరిచయం చేసి, ‘హిట్‌: ది థర్డ్‌కేస్‌’ అనే టైటిల్‌తో సినిమాను ముగించడం ద్వారా దర్శకుడు శైలేష్‌ కొలను తన  హీరో నాని అని క్లారిటీ ఇచ్చారు. ఆయన తొలిసారి పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నారు. 


Updated Date - 2022-12-03T06:42:36+05:30 IST