Kaari: ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదంటోన్న నిర్మాత
ABN , First Publish Date - 2022-11-25T18:57:09+05:30 IST
హీరో శశికుమార్ (M. Sasikumar), హీరోయిన్ అమ్ము అభిరామి (Ammu Abhirami) జంటగా నటించిన ‘కారి’ (Kaari) చిత్రం ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని ఆ చిత్ర
హీరో శశికుమార్ (M. Sasikumar), హీరోయిన్ అమ్ము అభిరామి (Ammu Abhirami) జంటగా నటించిన ‘కారి’ (Kaari) చిత్రం ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని ఆ చిత్ర నిర్మాత కె. లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జల్లికట్టును ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. మరోవైపు జల్లికట్టును నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ‘కారి’ చిత్రం రిలీజ్ నిలుపుదల చేయాలంటూ కొందరు కోర్టుకు వెళ్ళనున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో చిత్ర నిర్మాత లక్ష్మణ్ కుమార్, హీరో శశికుమార్, దర్శకుడు హేమంత్ విలేకరులతో మాట్లాడారు.
‘‘ఇందులో జల్లికట్టు ఒక అంశం మాత్రమే. మూడు వర్గాలకు చెందిన ప్రజల జీవిత సంఘర్షణలను జల్లికట్టును కేంద్రంగా చేసుకుని తెరకెక్కించాం. ఇందులో 18 రకాల జల్లికట్టు ఎద్దులను, 18 రకాలైన సాహస వీరులతో ఒక నిజమైన జల్లికట్టును తలపించేలా రూపొందించాం. ఈ సన్నివేశాలు ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా చిత్రీకరించలేదు. అందువల్ల అనుకున్నట్టుగానే శుక్రవారం విడుదల చేస్తున్నాం’’ అని వివరించారు. వారు చెప్పినట్లుగానే ఈ సినిమా శుక్రవారం కోలీవుడ్లో విడుదలైంది. (Producer about Kaari Movie)