ఇన్‌స్టాగ్రాం బయోలో నిక్ జోనాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన Priyanka Chopra తల్లి
ABN , First Publish Date - 2021-12-25T22:50:42+05:30 IST
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోను నటిస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన నటి ప్రియాంక చోప్రా. ఆమె అమెరికన్ సింగర్

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోను నటిస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన నటి ప్రియాంక చోప్రా. ఆమె అమెరికన్ సింగర్ అయిన నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి జోనాస్‌ను తొలగించింది. దీంతో ఆమె విడాకులు తీసుకొబోతుందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ, అటువంటిదేమీ లేదని ప్రియాంక తల్లి మధు చోప్రా చెప్పింది.
మధు చోప్రా తన ఇన్‌స్టాగ్రాం బయోలో నిక్ జోనాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇన్‌స్టా బయోలో అమెరికన్ సింగర్‌కి చోటు కల్పించింది. అతడిని జీనియస్ అని పేర్కొంది. ‘‘ 40ఏళ్లు డాక్టర్‌గా పనిచేశాను. సంతోషకరమైన ఇద్దరు పిల్లలకు తల్లిని. జీనియస్‌కు అత్తను. స్టూడియోకు మెనేజింగ్ డైరెక్టర్‌ను ’’ అని మధు చోప్రా ఇన్‌స్టాగ్రాం బయోలో రాసుకుంది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో తన అల్లుడుని మధు చోప్రా మెచ్చుకుంది. ‘‘ నిక్ నెమ్మ దస్తుడు, మెచ్యూర్‌గా ఆలోచిస్తాడు. అతడు అద్భుతమైన వ్యక్తి. కుటుంబంలోని ప్రతి ఒక్కరు అతడిని ప్రేమిస్తారు ’’ అని ప్రియాంక చోప్రా తల్లి చెప్పింది.
