Priyanka Chopra బాటలో నిక్ జోనాస్.. త్వరలో బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడా..?

ABN , First Publish Date - 2021-12-01T17:36:40+05:30 IST

బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ తన పాగా వేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ సిరీస్ ‘క్యాంటికో’తో ఇంగ్లీష్ చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ భామ మంచి గుర్తింపు సాధించి అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Priyanka Chopra బాటలో నిక్ జోనాస్.. త్వరలో బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడా..?

బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ తన పాగా వేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ సిరీస్ ‘క్యాంటికో’తో ఇంగ్లీష్ చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ భామ మంచి గుర్తింపు సాధించి అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ప్రియాంక బాటలోనే ఆ బ్యూటీ భర్త నిక్ జోనాస్ సైతం సాగుతున్నట్లు అనిపిస్తోంది ఆయన మాటలు వింటుంటే..


ఓ ఇంటర్య్వూలో హిందీ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాడు నిక్ జోనాస్. ‘నాకు బాలీవుడ్ అంటే ఎంతో ఇష్టం. ప్రియాంకతో పెళ్లి తర్వాత వాటితో నాకు కనెక్షన్ ఎక్కువగా పెరిగింది. నాకు అక్కడ ఎంతో మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారు పడే కష్టం నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేస్తుంది. మంచి ఆఫర్ వస్తే అక్కడి సినిమాల్లో నటిస్తానేమో?’ అంటూ ఈ అమెరికన్ సింగర్ చెప్పుకొచ్చాడు. దీంతో త్వరలోనే నిక్ సైతం ప్రియాంకని ఫాలో అవుతూ హిందీ సినిమాలు చేసే అవకాశం ఉందని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.


అంతేకాకుండా ఈ హాలీవుడ్ నటుడు బాలీవుడ్ పాటల గురించి మాట్లాడతూ.. ‘పాటలు ఎంతో బావుంటాయి. నేను ఇండియాలో ఉన్నప్పుడు, పెళ్లి సమయంలో ఎనో హిందీ పాటలు విన్నాను. అవి నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. నిజానికి ఇప్పుడు కూడా ఇంట్లో ఏవైనా పార్టీలు జరిగితే బాలీవుడ్ సాంగ్స్ మోగుతూనే ఉంటాయ‌’ని తెలిపాడు. కాగా డేటింగ్ తర్వాత తనకంటే 10 ఏళ్ల చిన్నవాడైనా నిక్‌ని, ప్రియాంక 2018లో రాజస్థాన్‌లోని  ఉమైద్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-01T17:36:40+05:30 IST