మహిళలనే కారణంతోనే బలమైన పాత్రలు రాయడం లేదు: priyanka chopra

ABN , First Publish Date - 2022-01-23T21:16:58+05:30 IST

భారత్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. ‘ఫ్యాషన్’, ‘మేరీకోమ్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి తదితర సినిమాల్లో నటించింది

మహిళలనే కారణంతోనే  బలమైన పాత్రలు రాయడం లేదు: priyanka chopra

భారత్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. ‘ఫ్యాషన్’, ‘మేరీకోమ్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది. సినిమాల్లో మహిళలకు సంబంధించిన పాత్రలను బలంగా రాయడం లేదని ఆమె చెప్పింది. ఆ విషయం తనకు చిరాకు తెప్పిస్తుందని వెల్లడించింది.  


‘‘మహిళలకు బలహీనమైన పాత్రలు రాసినా, పురుషులకు ధీటుగా ఆ పాత్రలను రాయకపోయినా నాకు చిరాకు వస్తుంది. ఆ పాత్రలకు వ్యతిరేకంగా పోరాడటంలో తప్పేమీ లేదు. భిన్న రకాల పాత్రల్లో నటించడమంటే నాకు చాలా ఇష్టం. అటువంటి పాత్రలను పోషించి పొరపాట్లను సరిదిద్దుకుంటే మెరుగవుతాం’’ అని ప్రియాంక చోప్రా వివరించింది. 


అయితే, ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. తాము ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యమంటూ ఆశ్చర్యపరిచే విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.  



Updated Date - 2022-01-23T21:16:58+05:30 IST