బాజీరావ్ మస్తానీ సినిమా నుంచి తప్పుకుంటానన్న ప్రియంకచోప్రా..ఒక్కసారిగా ఏడ్చేసిన నటి

ABN , First Publish Date - 2021-10-19T02:01:36+05:30 IST

చారిత్రక కథలను తెరపై అవిష్కరించడంలో సంజయ్ లీలా బన్సాలీకి ఎవరూ సాటి లేరు. మరాఠా యోధుడు బాజీరావ్‌ని ఆధారంగా చేసుకుని ఆయన తెరకెక్కించిన చిత్రం ‘‘బాజీరావ్ మస్తానీ ’’. ఆ చిత్రంలో బాజీరావ్

బాజీరావ్ మస్తానీ సినిమా నుంచి తప్పుకుంటానన్న ప్రియంకచోప్రా..ఒక్కసారిగా ఏడ్చేసిన నటి

చారిత్రక కథలను తెరపై అవిష్కరించడంలో సంజయ్ లీలా బన్సాలీకి ఎవరూ సాటి రారు. మరాఠా యోధుడు బాజీరావ్‌ని ఆధారంగా చేసుకుని ఆయన తెరకెక్కించిన చిత్రం ‘‘బాజీరావ్ మస్తానీ ’’. ఆ చిత్రంలో బాజీరావ్ పాత్రలో రణ్ వీర్ సింగ్, మస్తానీ పాత్రలో దీపికా పదుకొణె, కాశీబాయి పాత్రలో ప్రియాంక చోప్రా నటించారు. ఒకానొక సమయంలో ఆ చిత్రం నుంచి తప్పుకోవాలని ప్రియాంకచోప్రా అనుకుందంట. తను ఆ పాత్ర చేయనని ఏడ్చేసానని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.


రణ్ వీర్ సింగ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ..‘‘ సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌లల్లో బన్సాలీకి  నైపుణ్యం ఉంది. అతడు మరో సారి ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. ప్రియాంక చోప్రా గతంలో బన్సాలీ దర్శకత్వంలో ఒక పాటలో నటించింది. ఆయనతో సినిమాకు పూర్తిగా పనిచేసిన అనుభవం ఆమెకు లేదు. బన్సాలీ పట్టువదలని విక్రమార్కులా షాట్ సరిగ్గా వచ్చే వరకు తీస్తూనే ఉంటారు. ఒకరోజు ఆయన రాత్రి 9గంటల వరకు కూడా సింగిల్ షాట్ తీయలేదు. దీంతో విసిగిపోయిన ప్రియాంక..ఇది నిజమా? ఇక్కడ ఏమీ జరుగుతోంది? నాకు ఏమీ అర్థం కావడం లేదు? అని అడిగింది. 3 రోజులు అయ్యాక ఈ షాట్ అయిపోయింది కదా ఈ చిత్రం నుంచి  తప్పుకుంటానని ఆమె చెప్పింది’’ అని వివరించారు. ఆ ఇంటర్వ్యూలో రణ్ వీర్ పక్కనే కూర్చున్న ప్రియాంక తను సినిమా చేయనని సెట్స్‌ల్లో ఒక్కసారిగా ఏడ్చేసానని తెలిపింది.


రణ్ వీర్, ప్రియాంక, దీపికా కలిసి గతంలో రామ్ లీలా సినిమాలో నటించారు. ఆ సినిమాలో రణ్ వీర్, దీపికా కీలక పాత్రలు పోషించగా ప్రియాంక చోప్రా ఒక ప్రత్యేక గీతంలో కనిపించింది. బాజీరావ్ మస్తానీ సినిమా 2015, డిసెంబర్ 18న విడుదలైంది. అదేరోజు షారూఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ‘‘ దిల్ వాలే’’ చిత్రం కూడా విడుదలైంది. కానీ, బాక్సాఫీస్ దగ్గర బాజీరావ్ మస్తానీ విజయం సాధించడం విశేషం.  

Updated Date - 2021-10-19T02:01:36+05:30 IST