సరొగసి ద్వారా సంతానం

ABN , First Publish Date - 2022-01-23T08:09:47+05:30 IST

ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.

సరొగసి ద్వారా సంతానం

ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. సరొగసి విధానం ద్వారా ప్రియాంక - నిక్‌ జొనాస్‌ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘సరొగసి విధానం ద్వారా మేం పండంటి బిడ్డకు జన్మనిచ్చాం. ఈ రోజు మా జీవితంలో ఆనందం వెల్లివిరిసిన రోజు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సమయం మాకెంతో ముఖ్యమైనది. కాబట్టి మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు’’ అంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. 2018లో తన కంటే వయసులో పదేళ్ల చిన్నవాడైన నిక్‌ అనే పాప్‌ సింగర్‌ ని ప్రియాంక వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఈ దంపతులు లాస్‌ ఏంజెల్స్‌లో స్థిరపడిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-01-23T08:09:47+05:30 IST