త్వరలో వడ్డిస్తున్నాం.. ప్రియ‌మ‌ణి ‘భామా కలాపం’ ఫస్ట్ లుక్

ABN , First Publish Date - 2022-01-13T02:22:18+05:30 IST

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన న‌టి ప్రియ‌మ‌ణి. ఇప్పుడామె ప్రధాన పాత్రలో ‘భామా కలాపం’ పేరుతో ‘ఆహా’ ఓ సరికొత్త వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టింది. పేరుకి త‌గ్గ‌ట్టే దీనికి ‘డిలిషియ‌ష్ హోం కుక్డ్ థ్రిల్ల‌ర్‌’ అనే క్యాప్ష‌న్ పెట్టారు.

త్వరలో వడ్డిస్తున్నాం.. ప్రియ‌మ‌ణి ‘భామా కలాపం’ ఫస్ట్ లుక్

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన న‌టి ప్రియ‌మ‌ణి. ఇప్పుడామె ప్రధాన పాత్రలో ‘భామా కలాపం’ పేరుతో ‘ఆహా’ ఓ సరికొత్త వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టింది. పేరుకి త‌గ్గ‌ట్టే దీనికి ‘డిలిషియ‌ష్ హోం కుక్డ్ థ్రిల్ల‌ర్‌’ అనే క్యాప్ష‌న్ పెట్టారు. ‘డియర్ కామ్రేడ్’ మూవీ దర్శకుడు భరత్ కమ్మ షో రన్నర్‌గా.. అభిమ‌న్య‌ తాడిమేటి ఈ వెబ్ ఒరిజిన‌ల్‌ను డైరెక్ట్ చేశారు. బుధ‌వారం ఈ వెబ్ సిరీస్ ఫ‌స్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఈ ఫ‌స్ట్ లుక్‌లో.. ప్రియ‌మ‌ణి గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తూనే ఇంట్లోని వివిధ పాత్ర‌ల‌ను చేతుల్లో ప‌ట్టుకుని కాళికా మాత‌గా క‌నిపిస్తుంది. ఆమె క‌త్తి, గంప‌, బిర్యానీ ప్లేటు, గుడ్డు, పూజ రూమ్‌లోని బెల్ ఇవ‌న్నీ ప్రియ‌మ‌ణి చేతుల్లో ఆయుధాలుగా క‌నిపిస్తున్నాయి. ఇది గ‌మ‌నిస్తుంటే ఇంట్లో ఉంటూ వంట చేసే మ‌న మ‌హిళ‌ల్లో చాలా ర‌కాలైన షేడ్స్ ఉంటాయ‌ని, వారెలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉంటార‌నే అర్థాన్నిచ్చేలా ఉంది. అలాంటి మ‌హిళ గ‌మ్యం ఎలా ఉండ‌బోతుంద‌నేది ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. కాగా, పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’‌, డియ‌ర్ కామ్రేడ్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్రభాక‌ర్ ‘భామా కలాపం’కు సంగీతాన్ని అందించారు.



Updated Date - 2022-01-13T02:22:18+05:30 IST