జిమ్‌‌లో పుట్టిన రోజు జరుపుకొన్న హీరోయిన్.. వీడియో వైరల్..

కార్తి నటించిన ‘‘ చినబాబు’’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటి ప్రియ భవానీ శంకర్. ఆమె కొన్ని  రోజుల క్రితమే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొంది. జిమ్‌లో ఆ వేడుకలను సెలబ్రేట్ చేసుకొంది. తాజాగా ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆమె అభిమానులు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో.. జిమ్ ట్రైనర్ కేక్‌ను ఆమె వద్దకు తీసుకు వచ్చారు. చిన్న సుత్తితో ఆమె కేక్‌ను కొట్టి కట్ చేసింది. కేక్‌ను చిన్న ముక్కలుగా చేసి అక్కడ ఉన్న వారికి తినిపించింది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..


తెలుగు ప్రేక్షకులను ప్రియ భవానీ శంకర్ త్వరలోనే పలకరించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య నటించబోయే వెబ్ సిరీస్‌లో ఆమె హీరోయిన్ పాత్రను పోషించనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ప్రియ భవానీ శంకర్ కోలీవుడ్‌లో  ‘‘ ఇండియన్-2’’  సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. రాఘవ లారెన్స్ సరసన ‘‘ రుద్రన్ ’’ , అశోక్ సెల్వన్ హీరోగా నటించబోయే ‘‘ హాస్టల్ ’’ లోను ఆమె నటించబోతుంది. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.