Kaduva: ఆ ఓటీటీలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కడువా’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

ABN , First Publish Date - 2022-07-29T22:36:03+05:30 IST

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (Ayyappanum Koshiyum)తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). మలయాళం సూపర్

Kaduva: ఆ ఓటీటీలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కడువా’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (Ayyappanum Koshiyum)తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). మలయాళం సూపర్ స్టార్స్‌లో అతడు కూడా ఒకరు. కొత్త రకం కథలను చేయడానికీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘కడువా’ (Kaduva). షాజీ కైలాస్ (Shaji Kailas) దర్శకత్వం వహించాడు. పలు భాషల్లో జులై 7న  విడుదలైంది. ఈ మూవీ అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచింది.  థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర దించుతూ డిజిటల్ ప్లాట్‌ఫాం స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. 


‘కడువా’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 4నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాం జులై 29న సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపింది. ‘కడువా’ స్ట్రీమింగ్ డేట్‌పై పృథ్వీరాజ్ ఓ ప్రకటనను వెలువరించాడు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి మలయాళం సినిమాకు అద్భుతమైన ప్రేమ లభించింది. ప్రైమ్ వీడియోలో ‘కడువా’ కు ఈ విధమైన ప్రేమ లభిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నాడు. ‘కడువా’ 1990ల నేపథ్యంలో రూపొందింది. వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కీలక పాత్రలు పోషించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణను ఈ చిత్రంలో చూపించారు.



Updated Date - 2022-07-29T22:36:03+05:30 IST