గుండెపోటుతో ప్రముఖ కమెడియన్ మృతి.. 40 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి..

ABN , First Publish Date - 2022-02-17T19:12:07+05:30 IST

మలయాళంలో పాపులారిటీ ఉన్న నటులు, కమెడియన్లలో ప్రదీప్ కేఆర్ ఒకరు. ఎన్నో మంచి పాత్రలతో అలరించిన ఈ సీనియర్ నటుడ్ని మలయాళీ సినీ జనాలు..

గుండెపోటుతో ప్రముఖ కమెడియన్ మృతి.. 40 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి..

మలయాళంలో పాపులారిటీ ఉన్న నటులు, కమెడియన్లలో ప్రదీప్ కేఆర్ ఒకరు. ఎన్నో మంచి పాత్రలతో అలరించిన ఈ సీనియర్ నటుడ్ని మలయాళీ సినీ జనాలు కొట్టాయం ప్రదీప్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన 61 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 17న గుండెపోటుతో మరణించారు. దీంతో పలువురు మలయాళీ నటులు, హీరోలు ఆయన మృతికి సంతాపం తెలిపారు.


స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘మీ ఆత్మకు శాంతి చేకూరాలి కొట్టాయం ప్రదీప్’ అంటూ ఆయన ఫోటోని షేర్ చేశాడు. అలాగే ‘మిన్నాళ్ మురళీ’ ఫేమ్ టోవినో థామస్ ఇన్‌స్టాగ్రామలో ఆయన పిక్ పోస్ట్ చేసి.. దానికి ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. మరో నటుడు సైతం సోషల్ మీడియాలో ‘మీ కోసం ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు. ఈయనకి నటి మాయతో వివాహం కాగా.. వీరికి ఇద్దరు సంతానం కలిగారు.


అయితే ప్రదీప్ 2001లో ‘ఈ నాడు ఈనాలే వరే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. 40 ఏళ్ల వయసులో మొదటి సినిమా చేసిన ఈ నటుడు చనిపోయే వరకు 70పైగా సినిమాల్లో నటించారు. అయితే పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో జూనియర్ ఆర్టిస్ట్‌గా అంత ప్రాధాన్యం లేని, కనీసం డైలాగులు కూడా లేని పాత్రల్లో నటించారు.


అలాంటి చిన్న పాత్రలు చేసిన ప్రదీప్‌కి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘వినయ్‌తాండి వరువాయా’ సినిమాలో చేసిన నటి త్రిష అంకుల్ పాత్రతో మంచి బ్రేక్ వచ్చింది. అనంతరం ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోయారు. అంతేకాకుండా 2016లో జరిగిన రెండో ఆసియన్ కామెడీ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఉత్తమ సహాయ నటుడి అవార్డ్ సైతం సాధించాడు. కాగా.. ప్రదీప్ చివరి చిత్రం ‘ఆరట్టు’. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.









Updated Date - 2022-02-17T19:12:07+05:30 IST