హు ఐ యామ్...
ABN , First Publish Date - 2022-10-15T05:30:00+05:30 IST
వరుస విజయాలతో తెలుగునాట తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించుకున్నారు తమిళ హీరో శివకార్తికేయన్. అనుదీప్ కె.వి దర్శకత్వంలో..

వరుస విజయాలతో తెలుగునాట తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించుకున్నారు తమిళ హీరో శివకార్తికేయన్. అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘ప్రిన్స్’. అక్టోబరు 21న విడుదలవుతోంది. మరియా ర్యాబోషప్క కథానాయిక. తాజాగా ఈ చిత్రం నుంచి ‘హూ ఐ యామ్’ అనే పాటని చిత్రబృందం విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి తమన్ స్వరాలు అందించారు. డింకర్ కల్వల ఆలపించారు. డి. సురేశ్‌బాబు, పుస్కుర్ రామ్మోహన్‌రావు, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస