శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. మరియా ర్యాబోషప్క కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఖరారు చేశారు. దీపావళికి ‘ప్రిన్స్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మంగళవారం తెలిపారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సునీల్‌నారంగ్, డి. సురేష్‌బాబు, పుస్కూర్ రామ్ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.