OTTలోకి అక్షయ్ కుమార్ Samrat Prithviraj.. ఎప్పుడూ.. ఎక్కడా అంటే..
ABN , First Publish Date - 2022-06-28T19:32:18+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), మాజీ మిస్ యూనివర్స్ దివా మానుషి చిల్లర్ (Manushi Chillar) జంటగా నటించిన పిరియాడికల్ మూవీ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’...

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), మాజీ మిస్ యూనివర్స్ దివా మానుషి చిల్లర్ (Manushi Chillar) జంటగా నటించిన పిరియాడికల్ మూవీ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’. డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై కమర్షియల్ డిజాస్టర్‌గా మిగిలింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ థియేట్రికల్ రన్‌లో కేవలం రూ.80 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అయితే.. స్టోరీ పరంగా మాత్రం బావుందనే టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ పిరియాడికల్ మూవీ త్వరలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ప్రసారం కానుంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) యాజమాన్యం తెలియజేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంపెనీ చేసిన పోస్ట్‌లో.. ‘‘భయంలేని నాయకుడి వీరోచిత గాథ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ జూలై 1 నుంచి అందుబాటులోకి రానుంది’ అని రాసుకొచ్చింది. మూవీ ఓటీటీ విడుదల గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘మూడు దశాబ్దాల నా కెరీర్‌లో ఇలాంటి భారీ చారిత్రాత్మక పాత్రను ఎప్పుడూ పోషించలేదు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రను తెరపై ప్రదర్శించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ పురాణ గాథను అందరికీ తెలియజేయడం ఆనందంగా ఉంది. జూలై 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఇలాంటి గొప్ప భారతీయ యోధుడు, శక్తివంతమైన రాజు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ స్ఫూర్తిదాయకమైన కథ ప్రపంచవ్యాప్తంగా చేరుతుందని నేను సంతోషిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ మూవీలో సంజయ్ దత్, సోనూ సూద్, అశుతోష్ రాణా ముఖ్యపాత్రల్లో నటించారు.