‘కురుప్’‌తో దుల్కర్ కు సూపర్ హిట్ ఖాయం : ‘ప్రేమిస్తే’ భరత్

ABN , First Publish Date - 2021-11-10T18:11:45+05:30 IST

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’. ఇదో క్రైమ్ బయోపిక్. ఎయిటీస్ లో కేరళ పోలీస్ డిపార్ట్ మెంట్ ను గడగడలాడించిన నొటోరియస్ క్రిమినల్ సుకుమార కురుప్పు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్ మొదటి సినిమాను తెరకెక్కించిన శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాకి దర్శకుడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలాగే ఉన్న ఓ అమాయకుడ్ని చంపి పారిపోయిన సుకుమార కురుప్పు ఇంతవరకూ దొరకలేదు.

‘కురుప్’‌తో దుల్కర్ కు సూపర్ హిట్ ఖాయం : ‘ప్రేమిస్తే’ భరత్

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’. ఇదో క్రైమ్ బయోపిక్. ఎయిటీస్ లో కేరళ పోలీస్ డిపార్ట్ మెంట్ ను గడగడలాడించిన నొటోరియస్ క్రిమినల్ సుకుమార కురుప్పు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్ మొదటి సినిమాను తెరకెక్కించిన శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాకి దర్శకుడు.  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలాగే ఉన్న ఓ అమాయకుడ్ని చంపి పారిపోయిన సుకుమార కురుప్పు  ఇంతవరకూ దొరకలేదు. అప్పటి నుంచి వివిధ వేషాలతో రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ..  పోలీసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అతడి పాత్రనే దుల్కర్ తనదైన శైలిలో రక్తికట్టించబోతున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఈ సినిమా. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కురుప్ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైద్రాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. 


తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ కురుప్ లో కథానాయికగా నటిస్తుండగా.. ఇందులో మరో ముఖ్యపాత్రను ‘ప్రేమిస్తే’ భరత్ పోషించారు. ఇందులో అతడిది చాలా చిన్న పాత్రైనా కథని మలుపు తిప్పే పాత్ర అని చెప్పుకోవచ్చు. ‘కురుప్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో భరత్ మాట్లాడుతూ..  ‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను దుల్కర్ కి థాంక్స్ చెబుతున్నాను. మంచి రోల్ కోసం రికమెండ్ చేసిందుకు మరోసారి థాంక్స్ చెబుతున్నాను. ‘కురుప్’ సినిమా చాలా ఆసక్తికరమైన కథతో తెరకెక్కింది. దీని కోసం నేను వర్క్ చేసింది చాలా తక్కువ రోజులే అయినా.. ఈ సినిమా టీమ్ తో నేను చేసిన జెర్నీని నేను మరిచిపోను. ఇది దుల్కర్ కు నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇందులో ఆయన ఎక్కడా నటించినట్టే అనిపించదు. అంత సహజంగా నటించారు ఆయన. తప్పుకుండా ఈ సినిమాతో దుల్కర్ కు సూపర్ హిట్ ఖాయం’ అని అన్నారు. 

Updated Date - 2021-11-10T18:11:45+05:30 IST