ప్రేమికుడి వినోదం

ABN , First Publish Date - 2021-10-21T06:48:42+05:30 IST

నృత్య దర్శకుడు ప్రభుదేవా ‘ప్రేమికుడు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసింది. తాజాగా ఇప్పుడు ‘మిస్టర్‌ ప్రేమికుడు’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు...

ప్రేమికుడి వినోదం

నృత్య దర్శకుడు ప్రభుదేవా ‘ప్రేమికుడు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసింది.  తాజాగా ఇప్పుడు ‘మిస్టర్‌ ప్రేమికుడు’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రభుదేవా. తమిళంలో విజయం సాధించిన ‘చార్లీ చాప్లిన్‌’ చిత్రాన్ని నిర్మాతలు వి.శ్రీనివాసరావు, గుర్రం మహేశ్‌ చౌదరి ‘మిస్టర్‌ ప్రేమికుడు’ పేరుతో తెలుగులోకి  అనువదించారు.  ఈవిషయాన్ని వెల్లడిస్తూ ‘పుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం రూపుదిద్దుకొంది. ఇందులో ప్రభుదేవా కామెడీ,  ఆయన డాన్సులు ప్రేక్షకుల్ని అలరిస్తాయి.  హీరోయిన్లుగా నటించిన అదాశర్మ, నిక్కీ గల్రాని గ్లామర్‌ ఆకట్టుకుంటుంది.  ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చెప్పారు. శక్తి చిదంబరం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


Updated Date - 2021-10-21T06:48:42+05:30 IST