మోహన్‌లాల్ తనయుడి సినిమా వచ్చేది అప్పుడే

ABN , First Publish Date - 2022-01-18T18:36:21+05:30 IST

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నాలుగో చిత్రం ‘హృదయం’. వైవిధ్యమైన లవ్ స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమాకి వినీత్ శ్రీనివాసన్ దర్శకుడు. మేరీల్యాండ్ సినిమాస్ బ్యానర్ పై వైశాఖ్ సుబ్రహ్మణియన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అరుణ్ నీలకంఠన్ అనే పాత్రలో ప్రణవ్ నటిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీలో ఇంకా.. అరుణ్ కురియన్, విజయరాఘవన్, అజు వర్గీస్, ప్రశాంత్ నాయర్, జోజో జోస్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మోహన్‌లాల్ తనయుడి సినిమా వచ్చేది అప్పుడే

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నాలుగో చిత్రం ‘హృదయం’. వైవిధ్యమైన లవ్ స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమాకి వినీత్ శ్రీనివాసన్ దర్శకుడు. మేరీల్యాండ్ సినిమాస్ బ్యానర్ పై వైశాఖ్ సుబ్రహ్మణియన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అరుణ్ నీలకంఠన్ అనే పాత్రలో ప్రణవ్ నటిస్తున్నాడు.  కళ్యాణి ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీలో ఇంకా.. అరుణ్ కురియన్,విజయరాఘవన్, అజు వర్గీస్, ప్రశాంత్ నాయర్, జోజో జోస్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా.. విశ్వజిత్ ఒడుక్కత్తిల్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ఇది వరకు విడుదలైన ‘హృదయం’ చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. 


ఈ సినిమా దర్శకుడు ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ తనయుడు. హీరోగానూ, సింగర్ గానూ, దర్శకుడిగానూ, నిర్మాతగానూ మాలీవుడ్ లో అతడు చాలా పాపులర్. వినీత్ శ్రీనివాసన్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అందుకే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో  దర్శకుడు వినీత్ క్యామియో అపీరెన్స్ ఇస్తున్నాడు. 



Updated Date - 2022-01-18T18:36:21+05:30 IST