‘రంగమార్తాండ’ కోసం రంగంలోకి ప్రకాశ్ రాజ్ భార్య

ABN , First Publish Date - 2022-01-17T14:32:38+05:30 IST

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మారాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’ కు అఫీషియల్ రీమేక్. రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్టు ఇటీవల కృష్ణవంశీ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్ వెర్షన్‌కు స్వల్ప మార్పులు చేశారు. ఇక ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

‘రంగమార్తాండ’ కోసం రంగంలోకి ప్రకాశ్ రాజ్ భార్య

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మారాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’ కు అఫీషియల్ రీమేక్. రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్టు ఇటీవల కృష్ణవంశీ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్ వెర్షన్‌కు స్వల్ప మార్పులు చేశారు. ఇక ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. చివరి షెడ్యూల్ లో ఒక అద్బుతమైన పాటను చిత్రీకరించినట్టు కృష్ణవంశీ తెలిపారు. ఇందులో నటిస్తున్న ప్రధాన పాత్రధారులందరూ ఈ పాటలో కనిపిస్తారు. అయితే ఈ పాటకి ఓ స్పెషాలిటీ ఉంది.


ఈ పాటకు ప్రకాశ్ రాజ్ భార్య పోనీ వర్మ కొరియోగ్రఫీ చేసినట్టు కృష్ణవంశీ తెలిపారు. ఇళయరాజా అద్భుతంగా కంపోజ్ చేసిన ఈ పాట సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్ నటవిశ్వరూపాన్ని చూస్తారని కృష్ణవంశీ తెలిపారు. ఈ పాట చిత్రీకరణతో సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదే సరైన సమయం చూసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. మరి ‘రంగమార్తాండ’ తో ప్రకాశ్ రాజ్ ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటారో చూడాలి.       

Updated Date - 2022-01-17T14:32:38+05:30 IST