విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కన్నడ పవర్‌స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్(అప్పు) గతంలో చేసిన సేవలను ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు కొనసాగించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘నాకు ప్రత్యేకమైన రోజున ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. పునీత్ రాజ్‌కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై నేను ముందుకు తీసుకెళ్లబోతున్నా. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాను’’ అని అప్పూ ఫొటోను షేర్ చేశారు.
గత ఏడాది గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్‌కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. ఆయన ఆధ్వర్యంలో 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, 19 గోశాలలు, 16 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఇవి కాకుండా 1800 విద్యార్థుల బాధ్యతలను ఆయన తీసుకున్నారు. అయితే ఇందులో 1800 మంది విద్యార్థుల చదువు బాధ్యతను హీరో విశాల్ తీసుకున్నారు. ఈ విషయాన్ని పునీత్ మరణించిన తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విశాల్ తెలిపారు. ఈ ఏడాది నుంచి ఆయన ఆ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు అప్పూ సేవా కార్యక్రమాల్లో భాగమయ్యేందుకు ప్రకాశ్‌రాజ్ రావడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ కూడా తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తెలంగాణాలో పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. లాక్డౌన్లో ఎంతో మంది పేదలకు అండగా నిలిచారు.