‘సినిమా బిడ్డలం’ ప్యానల్‌ రాజీనామా!

Twitter IconWatsapp IconFacebook Icon
సినిమా బిడ్డలం ప్యానల్‌ రాజీనామా!

‘మా’ ఎన్నికల్లో ‘సినిమా బిడ్డలం’ ప్యానెల్‌ నుంచి గెలిచిన సభ్యులంతా రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామలు, వాగ్దానాలకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఉండేందుకే  ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్‌ మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో రౌడీయిజం కనిపించిందనీ, క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని అన్నారు. రాత్రికి రాత్రికి ఈసీ మెంబర్స్‌ రిజల్డ్‌ తారుమారు అయిందనీ, పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు, తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా సభ్యుల తరపున ఉంటామని ప్రకాశ్‌రాజ్‌  టీమ్‌ స్పష్టం చేసింది. 


రాజీనామా అప్పుడే వెనక్కి తీసుకుంటా... 

నేను ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. దానికి అధ్యక్షుడు మంచు విష్ణు స్వీకరించనని అన్నారు. ఒక షరతు మీద నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి, ‘తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అని మీరు మార్చకపోతే సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిేస్త, ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు. ‘అందరం కలిసే వెళ్తాం’ అన్న విష్ణు జనరల్‌ సెక్రటరీ మాదే... ట్రెజరర్‌ మనమే ఎవరు అడ్డొచ్చినా మెజారిటీ మనదే అనడం బాధ కలిగించింది. అదంతా కలుపుకెళ్లే విషయం కాదు. సగం సగం ప్యానళ్లు గెలిస్తే కలిసి పని చేయలేరని గతంలో రుజువైంది. ఎమోషనల్‌ డెసిషన్‌ కాదు.. చాలా ఆలోచించి... మేమంతా ‘మా’ అధ్యక్షుడికి రాజీనామా ఇస్తున్నాం. తమకు నచ్చిన వాళ్లతో కలిసి పని చేసుకోవాలని విష్ణుని కోరుతున్నాం. అభివృద్ధి కోరుకుంటున్నాం. చేయలేని పరిస్థితి ఉంటే మేం ప్రశ్నిస్తాం’’ అని ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.