Prakash raj : పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, అర్థం రెండూ ఉన్నాయి

ABN , First Publish Date - 2021-09-27T19:33:53+05:30 IST

అక్టోబర్ 10వ తేదీన మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి రేసులో ఉన్న ప్రకాశ్ రాజ్ ఈ రోజు మా కార్యాలయంలో తన టీమ్ తో వెళ్ళి నామినేషన్ ను దాఖలు చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు ప్రకాష్ రాజ్.

Prakash raj : పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, అర్థం రెండూ ఉన్నాయి

అక్టోబర్ 10వ తేదీన మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి రేసులో ఉన్న ప్రకాశ్ రాజ్ ఈ రోజు  మా కార్యాలయంలో తన టీమ్ తో వెళ్ళి నామినేషన్ ను దాఖలు చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నామినేషన్స్ వేశాం. 900 మంది ఉన్న అసోసియేషన్ ఇది.  అభివృద్ధి చేయడానికి మేము పోటీ చేస్తున్నాం.. రాజకీయ పార్టీల జోక్యం ఎవరు చేస్తున్నారో తెలీదు.. ఇది రాజకీయ ఎలక్షన్స్ కాదు.. ఇది కేవలం సినిమా ఎలక్షన్స్.  పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, అర్థం రెండూ ఉన్నాయి. మహానుభావులు అందరూ కూర్చొని 28 సంవత్సరాలక్రితం మా అసోసియేషన్ పెట్టారు. ప్రతి అధ్యక్షుడు బాగానే చేశారు.  గత ప్రెసిడెంట్ ని నువ్వు దిగు దిగు అని అన్యాయంగా ఆయన్ని దింపే ప్రయత్నం చేశారు.  ఇప్పుడు కొందరు వచ్చి సభ్యుల ను ప్రలోభ పెడుతున్నారు.  మన హీరోలందరినీ తీసుకొచ్చి ప్రోగ్రామ్ పెట్టీ ఫండ్ కలెక్ట్ చేసి 100మంది సభ్యులకు ప్లాట్ లు ఇస్తాను.  నేను మా బిల్డింగ్ కట్టను.  ఇప్పుడున్న ఆఫీస్ చాలు.  మా బిల్డింగ్ కడతాను, చార్మినార్ కడతాను, అది చేస్తా, ఇది చేస్తాను అంటున్నారు అవి ఏమి జరగవు అవన్నీ అబద్ధాలు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మా ఎలక్షన్ తరువాత మాట్లాడతాను.  ప్రజల్ని ఎంటర్ టైన్ మెంట్ చేసే  మన ఆర్టిస్టులు వుండగా ఎవరినో ఫండ్ అడగడం ఏమిటి? నా విజయాన్ని ఎవరు ఆపలేరు.  ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఏమి చేశారు? ఏమి చెయ్యలేదు.  అది మీకు తెలుసా? సభ్యులందరూ మిగతా వాళ్ళు ఇచ్చే తాయిలాలు తీసుకోండి ఓటు మటుకు నాకే వెయ్యండి’.. అని ప్రకాశ్ రాజ్ అన్నారు. 

Updated Date - 2021-09-27T19:33:53+05:30 IST