‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ

Twitter IconWatsapp IconFacebook Icon

మా ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుతో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత ఆయన ప్యానెల్ లో నెగ్గిన అభ్యర్ధులు తో కలుపుకొని మొత్తం 11 మంది సభ్యులు సైతం మా సభ్వత్వానికి రాజీనామా చేశారు. మా ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని,  బ్యాలెట్ పత్రాలు మారిపోయాయని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు లీడింగ్ లో ఉండగానే..  ఫలితాలు తారుమారు చేశారని .. రకరకాలుగా ప్రకాశ్ రాజ్ బృందం ఎన్నికల తీరుపై ఆరోపణలు చేశారు. అయితే వారు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, మా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని, ఎన్నికల అధికారి ఇటీవల క్లారిటీ ఇచ్చారు. 


అయితే దాంతో తృప్తి పడని ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కి నేడు  ఓ లేఖ రాశారు. తమకు న్యాయం చేయాల్సింది గా ఎన్నికల అధికారిని ప్రకాశ్ రాజ్ అందులో కోరారు. ఆ లేఖలో ప్రకాశ్ రాజ్   ‘మొన్న ముగిసిన ‘ మా’ ఎన్నికల్లో ఎన్నో దురదృష్ట కరమైన సంఘటనలకి మేము సాక్షులు గా మిగిలాము. డీ.ఆర్.సీ మెంబర్ మోహన్ బాబు, ‘మా’ మాజీ ప్రెసిడెంట్ నరేశ్ సంఘ విద్రోహక చర్యలు, వారి రూడ్ బిహేవియర్  ఎంతగానో బాధించాయి. వారి బెదిరింపులు, తిట్లు, దాడి తో మా ప్యానల్ సభ్యులు  ఎంతగానో ఆందోళన చెందారు. అలాంటి చర్యలు జరిపినవారిని తెలిసుండీ మీ పవర్స్ ఉపయోగించి  లోపలికి అనుమతిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ సంఘటనలకు సంబంధించిన కొన్ని విజువల్స్ మీడియాకెక్కాయి. వాటి వల్ల మేం పబ్లిక్ దృష్టిలో చులకన అయిపోయాము. అలాంటి దుశ్చర్యలు చేసిన వారిని జనం అసహ్యించుకున్నారు. ‘మా’ సభ్యులు కూడా అసలు నిజం తెలియాలను కుంటున్నారు. పోలింగ్ రోజున మీరు సీసీటీవీలు ఉపయోగించారని చెప్పారు. అందులో అవి రికార్డ్ అయి ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ ఫుటేజ్ ను దయచేసి మాకు ఇప్పించమని కోరుతున్నాను. పోలింగ్ కు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని కోరడానికి మాకు ప్రజాస్వామికంగా హక్కుంది. ఒక పోలింగ్ ఆఫీసర్ గా మీరు ఓ మూడు నెలల్లో మాకు వాటిని అప్పగించడం మీ బాధ్యత అంటూ ప్రకాశ్ రాజ్ ఆ లేఖలో తెలిపారు. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.