‘పాపవినాశనం’ లఘు చిత్రంపై ప్రముఖుల ప్రశంసలు

ABN , First Publish Date - 2022-06-08T03:14:59+05:30 IST

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే ఎన్నో కష్టాలుండేవి. మార్గాలు కనిపించేవి కావు. కానీ ఇప్పుడు ఒక్క లఘు చిత్రం.. నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇండస్ట్రీలోకి

‘పాపవినాశనం’ లఘు చిత్రంపై ప్రముఖుల ప్రశంసలు

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే ఎన్నో కష్టాలుండేవి. మార్గాలు కనిపించేవి కావు. కానీ ఇప్పుడు ఒక్క లఘు చిత్రం.. నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇండస్ట్రీలోకి స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం లఘుచిత్రాల ద్వారా పేరు తెచ్చుకుని.. సినీ ఇండస్ట్రీలోకి అడుగులు పెట్టినవారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడటువంటి ఒక సందేశాత్మల లఘు చిత్రాన్ని రూపొందించి.. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు దొంగరి మహేందర్ వర్మ. అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆయన రచించి, దర్శకత్వం వహించిన సినిమా ‘పాపవినాశనం’. శివాని, జోష్ రవి, జబర్దస్త్ అప్పారావు, సమ్మెట గాంధీ, దంచెనాల శ్రీనివాస్, ప్రియ, శివ, సాయి రెడ్డి ప్రముఖ పాత్రల్లో నటించారు. మాస్టర్ లిఖిత్ అండ్ అక్షిత్ సమర్పణలో.. ఇందిర దొంగరి నిర్మాతగా వ్యవహరించిన ఈ లఘు చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా శ్రవణ్ కుమార్ ఛాయాగ్రహణం, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో‌ను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. 


ఈ షోకి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ  చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, తెలంగాణ సీఎం పూర్వ పిఆర్‌ఓ గటిక విజయ్ కుమార్, సినీ నిర్మాత బెక్కం వేణుగోపాల్, నటుడు ఉత్తేజ్ వంటి ప్రముఖులందెరో హాజరయ్యారు. చిత్రం చూసిన అనంతరం అందరూ కూడా చిత్రాన్ని కొనియాడారు. అరగంటలో ఇంత గొప్ప చిత్రాన్ని రూపొందించిన మహేందర్‌ను అభినందించారు. త్వరలోనే ఈ లఘు చిత్రం యూట్యూబ్‌లోకి రానుంది.

Updated Date - 2022-06-08T03:14:59+05:30 IST