ప్రభుదేవా 58వ చిత్ర టైటిల్ ఇదే..

ABN , First Publish Date - 2022-01-29T02:01:19+05:30 IST

నృత్య దర్శకుడు నుంచి హీరోగా, ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా ఇపుడు మళ్ళీ హీరోగా బిజీ అయ్యారు. ఆయన వరుసగా తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే అమ్మ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ‘తేల్‌’ చిత్రంతో ప్రేక్షకుల

ప్రభుదేవా 58వ చిత్ర టైటిల్ ఇదే..

నృత్య దర్శకుడు నుంచి హీరోగా, ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా ఇపుడు మళ్ళీ హీరోగా బిజీ అయ్యారు. ఆయన వరుసగా తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే అమ్మ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ‘తేల్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘బహీర’తో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ‘రేక్లా’ చిత్రంలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి ‘వాల్టర్‌’ సినిమాను తెరకెక్కించిన అన్బు దర్శకత్వం వహిస్తున్నారు. ఒలింపియా మూవీస్‌ బ్యానరుపై అంబేత్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌ లుక్‌ను ప్రముఖ హీరో ఆర్య తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా రిలీజ్‌ చేశారు. ఇది ప్రభుదేవా నటించే 58వ చిత్రం కావడం గమనార్హం. 



Updated Date - 2022-01-29T02:01:19+05:30 IST