ఫస్ట్ లుక్: దివ్యాంగుడిగా ప్రభుదేవా

ABN , First Publish Date - 2021-08-05T22:59:06+05:30 IST

‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’గా గుర్తింపు పొందిన దర్శకనటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా హీరోగా నటించే కొత్త చిత్రం టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ బుధవారం రిలీజ్‌ చేసింది. హీరో ప్రభుదేవా దివ్యాంగుడిగా నటిస్తున్న

ఫస్ట్ లుక్: దివ్యాంగుడిగా ప్రభుదేవా

‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’గా గుర్తింపు పొందిన దర్శకనటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా హీరోగా నటించే కొత్త చిత్రం టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ బుధవారం రిలీజ్‌ చేసింది. హీరో ప్రభుదేవా దివ్యాంగుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పొయ్‌క్కాల్‌ గుదిరై’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, సంతోష్‌ పి. జయకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్లుగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌, బిగ్‌బాస్‌ ఫేం రైజా విల్సన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోణంలో తెరకెక్కిస్తుండగా మినీ స్టూడియో, డార్క్‌ రూమ్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 


కాగా, ఈ చిత్ర దర్శకుడు సంతోష్‌ గతంలో నటుడిగా కూడా ప్రేక్షకులకు పరిచయం. ఈయన గతంలో ‘హరహర మహాదేవకి’, ‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’, ‘గజినీకాంత్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. అలాగే, ‘ఇరండామ్‌ కుత్తు’ అనే చిత్రం ద్వారా నటుడిగా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమాకు డి.ఇమ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.



Updated Date - 2021-08-05T22:59:06+05:30 IST