దర్శకుడిగా ప్రభుదేవా అసిస్టెంట్‌

ప్రముఖ నృత్యదర్శకుడు, హీరో, దర్శకుడైన ప్రభుదేవా వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కలైమామణి దర్శకుడి అవతారమెత్తారు. ఆయన దర్శకత్వం వహించే చిత్ర షూటింగ్‌ ప్రముఖ నిర్మాత సురేష్‌ కామాక్షి, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు మురళి చేతుల మీదుగా ప్రారంభమైంది. కోలీవుడ్‌లో అనేక చిత్రాలను నిర్మించిన జేకేకి చెందిన జేఎఫ్ఎల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోగా శ్రీరామ్‌, హీరోయిన్‌గా ప్రీతి నటిస్తున్నారు. ఇదే నిర్మాణ సంస్థ నిర్మించే ‘లాగిన్‌’ చిత్రంలోనూ ప్రీతి హీరోయిన్‌గా నటించడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్‌ కామాక్షి, మురళితో పాటు దర్శకుడు రత్నశివ, డాన్స్‌మాస్టర్‌ కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో హీరోగా నటించే శ్రీరామ్‌ ‘పసంగ’, ‘గోలిసోడా’ వంటి చిత్రాల్లో బాలనటుడుగా మెప్పించిన విషయం తెలిసిందే. 

Otherwoodsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.