దివ్యాంగుడిగా ప్రభుదేవా

ABN , First Publish Date - 2021-08-06T07:18:26+05:30 IST

‘పోయిక్కాల్‌ కుతిరాయ్‌’ అనే తమిళ చిత్రంలో ప్రభుదేవా దివ్యాంగుడిగా నటిస్తున్నారు. కృత్రిమకాలుతో బిడ్డను చంకలో ఎత్తుకొని కనిపిస్తున్న ప్రభుదేవా ఫస్ట్‌లుక్‌ను...

దివ్యాంగుడిగా ప్రభుదేవా

‘పోయిక్కాల్‌ కుతిరాయ్‌’ అనే తమిళ చిత్రంలో ప్రభుదేవా దివ్యాంగుడిగా నటిస్తున్నారు. కృత్రిమకాలుతో బిడ్డను చంకలో ఎత్తుకొని కనిపిస్తున్న ప్రభుదేవా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కు సంతోష్‌ జయకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌, రైజా విల్సన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో పది రోజుల్లో తదుపరి షెడ్యూల్‌ షూటింగ్‌ చెన్నైలో ప్రారంభిస్తామని దర్శకుడు తెలిపారు.


Updated Date - 2021-08-06T07:18:26+05:30 IST