లావిష్ గెస్ట్ హౌస్ నిర్మించనున్న ప్రభాస్

ABN , First Publish Date - 2021-12-08T17:05:56+05:30 IST

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో ‘రాధేశ్యామ్, సలార్’ చిత్రాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ హైదరాబాద్ లో ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ నిర్మించే ఆలోచనలో ఉన్నారు.

లావిష్ గెస్ట్ హౌస్ నిర్మించనున్న ప్రభాస్

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో ‘రాధేశ్యామ్, సలార్’ చిత్రాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే..  ప్రభాస్ హైదరాబాద్ లో ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ నిర్మించే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో ప్రభాస్ కి 2 ఎకరాల స్థలం ఉంది. అందులోనే ఒక భారీ గెస్ట్ హౌస్ కానీ, బంగ్లాకానీ కట్టబోతున్నట్టు సమాచారం. 


దాదాపు 19 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా టర్న్ అయ్యారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఆయన వరుస ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హాలీడే హోమ్ గా ఈ గెస్ట్ హౌస్ ను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్స్ కోసం హైదరాబాద్ టు ముంబై రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ గెస్ట్ హౌస్ ను వినియోగించబోతున్నారు. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కాబోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 


Updated Date - 2021-12-08T17:05:56+05:30 IST