‘ఆదిపురుష్’ క్లైమాక్స్ షెడ్యూల్ మొదలైందట

ABN , First Publish Date - 2021-09-20T14:49:20+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్ధమవుతుండగా ‘సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ మూవీస్ షూటింగ్స్ మధ్య జంబ్లింగ్ చేస్తున్నారు.

‘ఆదిపురుష్’ క్లైమాక్స్ షెడ్యూల్ మొదలైందట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్ధమవుతుండగా ‘సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ మూవీస్ షూటింగ్స్ మధ్య జంబ్లింగ్ చేస్తున్నారాయన.  ఇటీవల ‘సలార్’ షెడ్యూల్ ను పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు ‘ఆదిపురుష్’  షూట్ కు షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది.  ముంబై లో ‘ఆదిపురుష్’ కు సంబంధించిన క్లైమాక్స్ షెడ్యూల్ మొదలైందట. ఈ షెడ్యూల్ నెల రోజులు సాగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ లోనే చిత్ర క్లైమాక్స్ ను పూర్తి చేస్తారని వినికిడి.


రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ మైథలాజికల్ డ్రామా లో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా ఆకట్టుకోబోతోంది. లేటెస్ట్ మోషన్ కేప్చర్ టెక్నాలజీ ఉపయోగించి  ‘ఆదిపురుష్’  మూవీని విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు ఓం రౌత్. పాన్ ఇండియా మూవీగా బహుభాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 22న విడుదలయ్యే అవకాశాలున్నాయి. అప్పటికి చిత్రం షూటింగ్ ను కూడా పూర్తి చేయాలనుకుంటున్నారట. మరి ‘ఆదిపురుషుడు’ రాముడిగా ప్రభాస్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. 

Updated Date - 2021-09-20T14:49:20+05:30 IST