పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన చేస్తున్న చిత్రాలలో హైయెస్ట్ బడ్జట్ తో రుపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ k (Project K). వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ (C Ashwani Dutt) ఈ మూవీని రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్ (Deepika Padukone) నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitab Bacchan) ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
అయితే, సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావాల్సిన ప్రభాస్... ప్రస్తుతం ఇండియాలో లేరు. ప్రభాస్ కాలి సర్జరీ కోసం ఫారిన్ వెళ్లారట. ప్రభాస్ తిరిగొచ్చాక సీతారామం టీంతో ఒక ప్రొమోషనల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్ట్ k ను వచ్చే ఏడాది అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ అప్పటికి కుదరకపోతే 2024 జనవరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఈ ప్రాజెక్ట్ అవెంజర్స్ రేంజులో ఉండబోతుంది. ఇండియాతో పాటు మిగిలిన ప్రపంచ దేశాల్లో కూడా ప్రాజెక్ట్ k విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
అన్నీ కుదిరితే ప్రభాస్ ప్రాజెక్ట్ k తో పాన్ వరల్డ్ స్టార్ అవ్వడం గ్యారెంటీ అని రెబల్ స్టార్ ఫాన్స్ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో మంచి మార్కెట్ సంపాధించుకున్న ప్రభాస్ ఈ మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎంతటి క్రేజ్ దక్కించుకుంటారో చూడాలి. కాగా, ఆదిపురుష్ 2023, సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తుండగా..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉంది.