వాటిపై మోజు పడుతున్న ప్రభాస్‌

ఏకబిగిన పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా మారిపోయిన స్టార్‌ హీరో ప్రభాస్‌ తన ఓ విషయం తెగ ఆసక్తిని కనపరుస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ప్రభాస్‌ తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటూ, మోజు పడుతున్న విషయమేంటో తెలుసా!.. వింటేజ్‌ వాహనాలను తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నారట ప్రభాస్‌. వివరాల్లోకెళ్తే, ఈ స్టార్‌ హీరో ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రం 'రాధేశ్యామ్‌' పీరియాడికల్‌ లవ్‌స్టోరి అనే సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం అప్పటి కార్లను కోనుగోలు చేసి ఉపయోగించారు. ఆ కార్లను ప్రభాస్‌ డ్రైవ్‌ చేస్తూ కూడా సినిమాలో కనిపిస్తారట. ఇప్పుడు మరోసారి అలాగే ప్రభాస్‌ వింటేజ్‌ వెహికల్‌ను 'సలార్‌' సినిమా కోసం ఉపయోగించారట. పాతకాలపు బుల్లెట్‌ను ఎన్‌ఫీల్డ్‌ తరహాలో తయారు చేయించి ఉపయోగిస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌లో వింటేజ్‌ వెహికల్స్‌ కనిపిస్తాయి. అందులో భాగంగానే ప్రభాస్‌ ఎన్‌ఫీల్డ్‌ చేజింగ్‌ సీన్స్‌ను భారీగా ఖర్చు పెట్టి మేకర్స్‌ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదలవుతుందని నిర్మాతలు ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోన్న 'సలార్‌' చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.