Prabhas : అప్పుడు తండ్రీకొడుకులు.. ఇప్పుడు తాతామనవళ్ళు ?

ABN , First Publish Date - 2022-09-01T20:21:30+05:30 IST

ప్రభాస్ (Prabhas), మారుతి (Maruthi) కాంబో మూవీ రీసెంట్‌గా ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది. ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. మారుతి గత చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) డిజాస్టర్ అవడంతో.. ప్రభాస్‌తో చేయబోయే చిత్రానికి బ్రేకులు పడతాయేమోనని అందరూ డౌట్ పడ్డారు.

Prabhas : అప్పుడు తండ్రీకొడుకులు.. ఇప్పుడు తాతామనవళ్ళు ?

ప్రభాస్ (Prabhas), మారుతి (Maruthi) కాంబో మూవీ రీసెంట్‌గా ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది. ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. మారుతి గత చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) డిజాస్టర్ అవడంతో.. ప్రభాస్‌తో చేయబోయే చిత్రానికి బ్రేకులు పడతాయేమోనని అందరూ డౌట్ పడ్డారు. అయితే ఆ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. సినిమాను తెరకెక్కించేందుకు ప్రభాస్ నుంచి మారుతికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే విభిన్నమైన టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా తీసే అవకాశమొస్తే.. మారుతి ఆషామాషీ సినిమా తీయాలనుకోడు కదా.. అతడి రేంజ్‌కు తగ్గట్టుగానే అదిరిపోయే కథ రాసుకున్నాడట.


‘రాజా డీలక్స్’ అనే సినిమా థియేటర్ నేపథ్యంలోని హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుందని వార్తలు వినిపిస్తుండగా.. అభిమానులు పండగచేసుకొనే మరో వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..  ఇందులో ప్రభాస్ తాతామనవళ్ళుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నడట. ఈ రెండు పాత్రలు దేనికదే ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు టాక్. 


‘బిల్లా’ (Billa) చిత్రంలో తొలిసారిగా డ్యూయల్ రోల్స్ చేసిన ప్రభాస్ ‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో తొలిసారిగా తండ్రీకొడుకులుగా రెండు వేరియస్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ‘రాజా డీలక్స్’ చిత్రంతో తాతా మనవళ్ళుగా నటించనుండడం విశేషంగా చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన మరో అంశమేంటంటే..  ఇందులోని  తాత పాత్ర ‘బంగార్రాజు’ (Bangarraju) లో నాగార్జున (Nagarjuna) తరహాలో ఘోస్ట్ అని తెలుస్తోంది. అలాగే అందులో లాగానే మనవడి పాత్రతో తాత పాత్రకు బాగా ఎమోషల్ టచ్ ఉంటుందట. మరి నిజంగానే ప్రభాస్ తాతా మనవళ్ళుగా నటిస్తాడో లేదో తెలియాలంటే..మరి  కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-09-01T20:21:30+05:30 IST