Prabhas ప్రస్థానానికి 20 వసంతాలు

Twitter IconWatsapp IconFacebook Icon
Prabhas ప్రస్థానానికి 20 వసంతాలు

ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఊహించలేదు

అతని శ్రమ, పట్టుదల, అభిమానుల అండదండలే కారణం

- కృష్ణంరాజు(krishnam raju)


‘‘డార్లింగ్‌గా తెలుగు ప్రేక్షకులచే పిలిపించుకునే ప్రభాస్‌ ఒకే ఒక్క సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఎవరు అనుకోలేదు. కానీ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు’’ అని రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అన్నారు. ప్రభాస్‌ కెమెరా ముందుకొచ్చి మంగళవారానికి  20 ఏళ్ళు పూర్తయింది. 2002 జులై 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్‌ పరిచయ చిత్రం ‘ఈశ్వర్‌’ ఇదే రోజున రామానాయుడు  స్టూడియోలో మొదలైంది. హీరోగా తొలి అడుగు వేస్తున్న ప్రభాస్‌ను పెదనాన్న కృష్ణం రాజు క్లాప్‌ కొట్టి సూపర్‌స్టార్‌గా ఎదగమని దీవించారు. ఆ ఆశీర్వాద బలం ఫలించి ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆయన ఆ స్థాయికి ఎదుగుతాడని ఆశీర్వదించిన కృష్ణంరాజు కూడా ఊహించలేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉండి హీరోగా పరిచయం అవ్వడం అన్నది మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది, కానీ ఆ తరువాత సినిమాలతో హీరోగా సత్తా చాటి పోటీకి తట్టుకుని ఎదగడం అన్నది వాళ్ళ వాళ్ళ సొంత టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలా మాస్‌ ఇమేజ్‌ అందుకున్న ప్రభాస్‌ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. తాజాగా నటిస్తున్న ‘ఆదిపురుష్‌’తో గ్లోబల్‌ స్టార్‌గా మారనున్నాడని అభిమానులు విశ్వసిస్తున్నారు. అందుకు కారణం.. ఆ చిత్రానికి హాలీవుడ్‌లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (Prabhas comples 20 years in tfi)


ప్రభాస్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అభిమానులు సంబరాలు జరుపుకొంటున్నారు. ఆలిండియా రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు జె.ఎస్‌.ఆర్‌.శాస్ర్తి (గుంటూరు) ఆధ్వర్యంలో మంగళవారం హైద్రాబాద్‌లోని కృష్ణంరాజు ఇంట్లో సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. దర్శకుడు జయంత్‌ సి పరాన్జీ, నిర్మాత అశోక్‌ కుమార్‌, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని  కేక్‌ కట్‌ చేశారు. (20 years for Eeswar movie)

Prabhas ప్రస్థానానికి 20 వసంతాలు

కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ హీరోగా పరిచయమై అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది. గోపికృష్ణ బ్యానర్‌లో ప్రభాస్‌ను హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. నిర్మాత అశోక్‌ కుమార్‌, దర్శకుడు జయంత్‌ వచ్చి ఆ అవకాశం మాకు ఇవ్వండి అని అడిగారు. ఈశ్వర్‌ కథ నచ్చి ఓకే అన్నాం. ఆ చిత్రం చక్కని విజయం అందుకుని తనను హీరోగా నిలబెట్టింది. నిర్మాత అయుండి అశోక్‌కుమార్‌ విలన్‌గా నటించడం గొప్ప విషయం. ప్రభాస్‌ తొలి చిత్రం చూసి గొప్ప హీరో అవుతాడనుకున్నాం. కానీ ఎవరు ఊహించని విధంగా ప్యాన్‌ ఇండియా స్టార్‌గా(pan india star prabhas) ఎదిగాడు. అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలే దానికి కారణం. అందుకు చాలా ఆనందంగా ఉంది.  నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేేస గొప్ప గుణం ఉంది. ప్రభాస్‌ ఇలాగే మంచి స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. (krsihnam raju about prabhas)

Prabhas ప్రస్థానానికి 20 వసంతాలు

‘‘నేను పరిచయం చేసిన హీరో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదుగుతాడని అనుకోలేదు. ప్రభాస్‌ నిజంగా గొప్ప వ్యక్తి. ఈ మధ్య కలిశాను. ఈశ్వర్‌ సమయంలో ఎలా ఉండేవాడో అదే అభిమానాన్ని చూపించాడు. స్టార్‌ అన్నగర్వం ఎక్కడా లేదు. నా హీరో ఈ రేంజ్‌ కి వెళ్లడం మరచిపోలేని అనుభూతి’’ అని దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ అన్నారు. 


‘‘ఈశ్వర్‌’ కథతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. ఫైనల్‌గా ప్రభాస్‌ నచ్చడంతో కృష్ణంరాజుగారితో మాట్లాడి ఒప్పించాం. అప్పటికీ ఇప్పటికీ ప్రభాస్‌లో ఎలాంటి మార్పులేదు’’ అని అశోక్‌కుమార్‌ అన్నారు.


‘‘ప్రభాస్‌కి నేనే పెద్ద అభిమానిని. ఈ విషయం తనతో చెబితే అవును అంటాడు. హీరోగా అంత ఇమేజ్‌ వచ్చినా అందరితో సింపుల్‌గా ఉంటాడు. ప్రభాస్‌ని చూస్తుంటే పెద్దమ్మగా చాలా గర్వాంగా ఉంది. అభిమానుల అండతోనే తను ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు’’ అని కృష్ణంరాజు సతీమణి శ్యామలా అన్నారు. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.