Chatrapathi: 100 రోజుల వేడుకలో జ్ఞాపికలకు బదులు గొడ్డళ్లు

ABN , First Publish Date - 2021-07-20T01:19:55+05:30 IST

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన తొలి సినిమా ‘ఛత్రపతి’. మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో రూపుదిద్దుకొన్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ఇది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌ ప్రభాస్‌ అభిమానులకే కాదు మిగిలిన ప్రేక్షకులకూ

Chatrapathi: 100 రోజుల వేడుకలో జ్ఞాపికలకు బదులు గొడ్డళ్లు

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన తొలి సినిమా ‘ఛత్రపతి’. మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో రూపుదిద్దుకొన్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ఇది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌ ప్రభాస్‌ అభిమానులకే కాదు మిగిలిన ప్రేక్షకులకూ తెగ నచ్చేసింది. 2005లో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్‌ నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఈ సినిమాలో ప్రభాస్‌ తల్లి పాత్రను భానుప్రియ పోషించారు. షఫీ మరో కొడుకుగా నటించారు. శ్రియ కథానాయిక. ‘ఛత్రపతి’ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మించారు. ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారైన ‘ఛత్రపతి’ వసూళ్ల పరంగా కూడా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం వంద రోజుల వేడుకలో ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు జ్ఞాపికలకు బదులు గొడ్డళ్లు ఇవ్వడం విశేషం. ఇదే చిత్రం ప్రస్తుతం హిందీలో రూపుదిద్దుకుంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేస్తూ వి.వి. వినాయక్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

-వినాయకరావు

Updated Date - 2021-07-20T01:19:55+05:30 IST