మూల పురుష్...
ABN , First Publish Date - 2022-12-10T06:31:08+05:30 IST
‘ఆదిపురుష్’ ప్రభాస్ అయితే... మూల పురుష్ సింగీతం శ్రీనివాసరావు. ఎందుకంటే ఎన్నో ప్రయోగాలకు ఆయన ఆద్యుడు.

‘ఆదిపురుష్’ ప్రభాస్ అయితే... మూల పురుష్ సింగీతం శ్రీనివాసరావు. ఎందుకంటే ఎన్నో ప్రయోగాలకు ఆయన ఆద్యుడు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’.. ఇలా ఒకటా రెండా..? ఆయన టచ్ చేయని జోనర్ లేదు. ఎవరూ సృశించని కథల్ని ఆయన వెండి తెరపై సినిమాలుగా మలుస్తారు. ఈ వయసులోనూ అదే హుషారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రానికి సింగీతం సలహాలూ, సూచనలు అందిస్తున్నారు. ఈ స్ర్కిప్టులో ఆయనది ప్రధాన పాత్ర. ‘ప్రాజెక్ట్ కె’ కూడా ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్టే. అందుకే తెలివిగా సింగీతం శ్రీనివాసరావుని తీసుకొచ్చి, ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావించారు. ‘ప్రాజెక్ట్ కె’ సెట్లో... ప్రభాస్ - సింగీతం సీరియస్ చర్చల్లో ఉండగా క్లిక్‌మన్న ఫొటో ఇది.