ఆ కవిత ప్రభాకరరెడ్డి జీవితాన్ని మార్చేసింది!

ABN , First Publish Date - 2021-04-17T00:35:19+05:30 IST

ప్రభాకరరెడ్డి... పరిచయం అక్కర్లేని విభిన్న నటుడు. హీరోగా పరిచయమై, విలన్‌ వేషాలు వేసి, చివరకు క్యారెక్టర్‌ యాక్టర్‌గా జనం గుండెల్లో మిగిలారు. సూర్యాపేటకు చెందిన ఆయన డాక్టర్‌, యాక్టర్‌ ఒకేసారి అయ్యారు. ఎలాగంటే తొలి సినిమా

ఆ కవిత ప్రభాకరరెడ్డి జీవితాన్ని మార్చేసింది!

ప్రభాకరరెడ్డి... పరిచయం అక్కర్లేని విభిన్న నటుడు. హీరోగా పరిచయమై, విలన్‌ వేషాలు వేసి, చివరకు క్యారెక్టర్‌ యాక్టర్‌గా జనం గుండెల్లో మిగిలారు. సూర్యాపేటకు చెందిన ఆయన డాక్టర్‌, యాక్టర్‌ ఒకేసారి అయ్యారు. ఎలాగంటే తొలి సినిమా ‘చివరకు మిగిలేది’ చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చే సమయానికే ప్రభాకరరెడ్డి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆ సినిమా విడుదలకంటే ముందే రిజల్ట్స్‌ వచ్చి డాక్టర్‌ అయ్యారు. హైదరాబాద్‌లో ఒక పక్క ప్రాక్టీసు చేస్తూనే, మరో పక్క ‘భీష్మ’, ‘తండ్రులు కొడుకులు’ చిత్రాల్లో నటించారు. మంచి అవకాశాలు వస్తున్నప్పుడు ఎందుకు వదలాలి అనుకొని ప్రాక్టీసు వదిలేసి సినిమాలకే పరిమితమయ్యారు. అయితే ఆ తర్వాత అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడ్డారు. ప్రాక్టీసు కూడా లేకపోవడంతో ఆర్టికంగా, మానసికంగా కష్టాలు పడ్డారు. తెలుగుతో పాటు ఉర్దూ కూడా బాగా తెలిసుండటంతో తన బాధల్ని ఓ కవిత రూపంలో రాసుకున్నారు ప్రభాకరరెడ్డి. దాని తెలుగు అనువాదమిది. 


‘రేపు జీవితంలో తెల్లవారుతుందన్న ఆశతో ముందుడుగు వేశాను. కానీ దారి కఠినంగా ఉంది. గమ్యం ఎంతో దూరంలో ఉంది. అయినా ముందుకు సాగుతూనే ఉన్నాను. అటో ఇటో తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. నా భవిష్యత్‌ అగమ్యగోచరంగా ఉంది. అయినా అంతరాత్మకు వ్యతిరేకమైన పనులు చేసి పైకి రావాలన్న భావం కలగడం లేదు. మనసు మందగించింది. గుండె మండుతోంది. మండిన గుండె నిప్పు కణంగా మారిపోయింది. ఆ కణం మసై పోయింది. బూడిద మట్గిగా మారింది. ఇప్పుడు నేను బతికిలేను’. అయితే ఈ కవిత రాసిన విధంగా ఆయన జీవితం ముగియలేదు. అదృష్టం వచ్చి తలుపు తట్టింది. అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. ఒక్క నెలలోనే పది సినిమాలు రావడంతో తను రాసిన కవితను మళ్లీ చదివే అవకాశం ఆయనకు రాలేదు.

Updated Date - 2021-04-17T00:35:19+05:30 IST