MAA: ఎన్నికల అధికారి ఆయనకు భయపడ్డాడు: ప్రభాకర్‌

ABN , First Publish Date - 2021-10-13T01:14:00+05:30 IST

‘‘మా ప్యానల్‌కు సంబంధించిన ఈసీ మెంబర్స్‌ బ్యాలెట్స్‌, పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఎన్నికల అధికారి తనతో తీసుకెళ్తుంటే.. ‘అవి పట్టుకెళ్లకూడదు కదా సర్‌ ఇక్కడే వాటిని సీల్‌ చేయండి’ అన్నాను. నాకు ఆ రైట్‌ ఉంది అని ఆయనతో తీసుకెళ్లిపోయారు. సరే చేతులు మారిపోయాయి.. ఆయన కూడా మనలాగే ఎవరికో భయపడ్డాడు అని అందుకే అలా చేశాడు అనుకున్నాం’’ అని నటుడు ప్రభాకర్‌ అన్నారు.

MAA: ఎన్నికల అధికారి ఆయనకు భయపడ్డాడు: ప్రభాకర్‌

మా దృష్టిలో ప్రకాశ్‌రాజ్‌ విజేత

అన్యాయంగా లెక్కింపు జరిగింది..

ఎన్నికల అధికారి ఆయనకు భయపడ్డాడు...

నేను చెప్పేది ఏంటో కూడా వినకుండా విష్ణు అరిచాడు..

ఆ బూతులు ఎప్పుడూ వినలేదు..

తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సబబేనా...


‘‘మా ప్యానల్‌కు సంబంధించిన ఈసీ మెంబర్స్‌ బ్యాలెట్స్‌, పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఎన్నికల అధికారి తనతో తీసుకెళ్తుంటే.. ‘అవి పట్టుకెళ్లకూడదు కదా సర్‌ ఇక్కడే వాటిని సీల్‌ చేయండి’ అన్నాను. నాకు ఆ రైట్‌ ఉంది అని ఆయనతో తీసుకెళ్లిపోయారు. సరే చేతులు మారిపోయాయి.. ఆయన కూడా మనలాగే ఎవరికో భయపడ్డాడు అని అందుకే అలా చేశాడు అనుకున్నాం’’ అని నటుడు ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘మా’ ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ మెజార్టీ వస్తుందనే రిజల్ట్‌ ఆపేశారు. చాలా అన్యాయంగా కౌంటింగ్‌ జరిగింది. ఇంటికి తీసుకెళ్లిన ఈసీ మెంబర్స్‌ ఓట్ల గురించి అడిగితే విష్ణు నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారికి చెబితే ‘శ్రీకాంత్‌ మీరు ఫిర్యాదు చేేస్త, ఎన్నికలు రద్దు అవుతాయి. వివాదం కోర్టుకు వెళ్తుంది. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు’ అన్నారు. అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని వదిలేశాం’’ అని ప్రభాకర్‌ చెప్పారు. 


రెండు, మూడు పదవుల రిజల్ట్‌ వచ్చాక మిగతావి పక్కన పడేయడం ప్రపంచంలో ఏ ఎలక్షన్ల చరిత్రలోనూ వినలేదు. ‘మా’ ప్యానల్‌ మెజారిటీ వస్తుందని తెలుసు. అందుకే రిజల్ట్‌ ఆపేశారు. మా చేతకానితనం అని వదిలేశాం. ప్రకటన అయిపోయింది.. అందరూ వెళ్లిపోయారు.. నేను చివరి వరకూ ఉన్నా. మాకు సంబంధించిన ఈసీ మెంబర్స్‌ బ్యాలెట్స్‌, పోస్టల్‌ బ్యాలెట్స్‌ తనతో తీసుకెళ్తుంటే.. ‘అవి పట్టుకెళ్లకూడదు కదా సర్‌.. ఇక్కడే వాటిని సీల్‌ చేయండి’ అన్నాను. నాకు ఆ రైట్‌ ఉంది అని తీసుకెళ్లిపోయారు. సరే.. మేం భయపడినట్లే ఎలక్షన్‌ ఆఫీసర్‌ కూడా భయపడ్డారు అనిపించి మాట్లాడకుండా ఊరుకున్నాం. సోమవారం మళ్లీ కౌంటింగ్‌ మొదలైంది.. మాకేదో అనుమానం వచ్చి.. నేను, శ్రీకాంత్‌ ముందుకెళ్తే.. ‘‘ప్రకాశ్‌రాజ్‌గారి ముందే మీ బ్యాలెట్స్‌ ఓపెన్‌ చేశాం. అంతా కరెక్ట్‌గా ఉన్నాయి’’ అని విష్ణు శ్రీకాంత్‌తో చెప్పారు. మధ్యలో నేను విష్ణుతో మాట్లాడటానికి వెళ్తే.. నేను ఏం చెబుతున్నానో కూడా వినకుండా ‘యామ్‌ ఐ టాకింగ్‌ టు యు’ అంటూ నాపై గట్టిగా అరిచాడు. ఆ సమయంలో నేను కూడా ఆరిస్తే ఉన్న పరువు ఇంకా పోయేది. ప్రెసిడెంట్‌తో గొడవ పడితే నాపైనే ఊస్తారని సంస్కారంతో ఆగిపోయా. అక్కడ జరిగిన ఇష్యూ మీద ఫిర్యాదు చేస్తే ఎలక్షన్‌ రద్దు అవుతుంది. ఉన్న పరువుని ఇంకా దిగజార్చడం ఎందుకని సైలెంట్‌గా పక్కకి వచ్చాం. కానీ రేపు ప్రమాణస్వీకారం అయ్యాక కలిసి పని చేయాల్సినప్పుడు ప్రశ్నిస్తే పనులు ఆగిపోతాయి. అవతలి వ్యక్తి మాట వినడానికే ఇష్టపడకపోతే.. ఏ పనీ ముందుకు వెళ్లదు. గొడవలు లేకుండా పనులు ముందుకు వెళ్లాలంటే ఏదో ఒక ప్యానలే పని చేయాలి. రెండు ప్యానళ్లు చేస్తే ఏ పని జరగదని గ్రహించి మేమంతా ఈ నిర్ణయం తీసుకున్నాం. 


తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సబబేనా...

‘‘ఎన్నికలు రోజు మోహన్‌బాబుగారు తిట్టిన తిట్లు జీవితంలో ఎప్పుడూ వినలేదు. ఎన్నికల రోజు బెనర్జీగారి కళ్లతో నీళ్లు చూసి రక్తం మరిగిపోయింది. ఎదుట తండ్రిలాంటి వ్యక్తి ఏం చేయగలం.. ఇండస్ట్రీలో కొంతకాలం ఉండాలి.. ఎదురు మాట్లాడితే 20 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. తప్పు చేయకపోయినా కొన్నిసార్లు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. నాకు ఆ అనుభవం ఉంది. అందుకే కాంప్రమైజ్‌ అయ్యాం. ఆ రోజు పరిస్థితులు చూస్తే ‘మా’ అధ్యక్ష పదవికి విష్ణు పోటీ చేసినట్లు అనిపించలేదు. మోహన్‌బాబుగారు, నరేశ్‌ పోటీ చేసినట్లుంది. సభ్యులకు మేలు చేయడానికి బూతులు తిట్టుకుంటూ వచ్చారని సరిపెట్టుకున్నాం. ఆయన తిట్టిన తిట్లకు బెనర్జీగారు కాబట్టి నోరు మూసుకుని ఉన్నారు. గతంలో జరిగిన వివాదాల వల్ల సభ్యులు రెండున్నర ఏళ్లు నష్టపోయారు. రానున్న రోజుల్లో ఆ సమస్య రాకూడదనే వివాదాలకు దూరంగా ఉన్నాం. సభ్యులకు మంచి జరగాలి అని ప్రకాశ్‌రాజ్‌ చెప్పిన ఒక్కో మాట మనసుకు హత్తుకుని ఆయనతో నడిచాం. మా దృష్టిలో ప్రకాశ్‌రాజ్‌గారు గెలిచారు. రిజైన్‌ చేయడానికి కారణమేంటో చెప్పడానికే ఈరోజు ముందుకొచ్చాం. 

మనోజ్‌ లేకపోతే కొట్టుకు చచ్చేవారు...

ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రంలో మంచు మనోజ్‌, విష్ణు లేకపోతే.. జనాలు చూసిన రచ్చ చాలా చిన్నది అయ్యేది. ఆ ఇద్దరూ జరుగుతున్న గొడవల్ని సర్దుమణిగేలా చూశారు. అక్కడ మనోజ్‌ లేకపోతే కొట్టుకు చచ్చేవారు. అంతగా గొడవలు జరిగాయి. మనోజ్‌ చల్లగా ఉండాలి. గొడవల్ని చాలా కంట్రోల్‌ చేశాడు. 


Updated Date - 2021-10-13T01:14:00+05:30 IST