Shakira: పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న పాప్ సింగర్

ABN , First Publish Date - 2022-07-30T22:03:42+05:30 IST

పాప్ సాంగ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సింగర్ షకీరా (Shakira). పన్ను ఎగవేత ఆరోపణలను ఆమె ఎదుర్కొంటుంది. అందువల్ల ఆమెకు ఎనిమిదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం

Shakira: పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న పాప్ సింగర్

పాప్ సాంగ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సింగర్ షకీరా (Shakira). పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటుంది. అందువల్ల ఆమెకు ఎనిమిదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పెయిన్ న్యాయవాదులు పేర్కొంటున్నారు. 


పాప్ సింగర్ షకీరా 2012 నుంచి 2014 మధ్య 14.5మిలియన్ యూరోల ఆదాయాన్ని అర్జించింది. ఈ ఆదాయంపై స్పెయిన్ ప్రభుత్వానికీ పన్నును చెల్లించాల్సి ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. అందువల్ల 24మిలియన్ యూరోలను జరిమానాగా చెల్లించాలని బార్సిలోనా న్యాయవాదులు కోరారు. అందుకు ఆమె నిరాకరించింది. తాను అమాయకురాలినని తెలిపింది. కోర్టులో విచారణకు సిద్ధమైంది. ఈ కేసు త్వరలోనే కోర్టు ముందుకు రానుంది. బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ డిఫెండర్ గెరార్డ్ పిక్ (Gerard Pique)తో షకీరా డేటింగ్ చేసింది. 2011లో స్పెయిన్‌కు వచ్చింది. అయినప్పటికీ, 2015వరకు బహమాస్‌లో పన్నులను చెల్లించింది. వివిధ ఇంటర్నేషనల్ టూర్స్ ద్వారా 2013-14మధ్య అమెరికాలో ఆదాయాన్ని అర్జించానని షకీరా పేర్కొంది. తాను పూర్తి స్థాయిలో స్పెయిన్‌కు 2015లోనే వచ్చానని వెల్లడించింది. అప్పటి వరకు అన్ని పన్నులను చెల్లించానని స్పష్టం చేసింది. స్పానిష్ ప్రభుత్వానికీ కూడా 17. 2 మిలియన్ యూరోలను పన్నుగా చెల్లించానని తెలిపింది. ప్రభుత్వానికీ ఎటువంటి పన్ను బకాయి లేనని చెప్పింది. షకీరా, గెరార్డ్‌కు ఇద్దరు పిల్లలున్నారు. ఈ జంట విడిపోతున్నట్టు జూన్‌లో ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. 

Updated Date - 2022-07-30T22:03:42+05:30 IST