Mika Singh: ప్రైవేటు ఐ ల్యాండ్‌ కొన్న పాప్ సింగర్

ABN , First Publish Date - 2022-09-30T21:44:08+05:30 IST

పాప్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో ఫేమ్ సంపాదించుకున్న సింగర్ మికా సింగ్ (Mika Singh). అతడు తాజాగా ఓ ప్రైవేట్ ఐ ల్యాండ్‌ని కొనుగోలు చేశాడు

Mika Singh: ప్రైవేటు ఐ ల్యాండ్‌ కొన్న పాప్ సింగర్

పాప్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో ఫేమ్ సంపాదించుకున్న సింగర్ మికా సింగ్ (Mika Singh). అతడు తాజాగా ఓ ప్రైవేట్ ఐ ల్యాండ్‌ని కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సింగర్ అభిమానులందరు షేర్ చేయడం మొదలుపెట్టారు. 


మికా కొత్తగా కొన్న ఐ ల్యాండ్‌లో సరదాగా బోట్ రైడ్ చేస్తున్నాడు. ద్వీపంతో పాటు 7బోటులు, 10గుర్రాలను కొన్నట్టు చెప్పాడు. తన ఐల్యాండ్‌ను అందమైన స్వర్గంగా అభివర్ణించాడు. ప్రజలందరు తన ద్వీపాన్ని సందర్శించాలని కోరాడు. కానీ, ఐ ల్యాండ్‌ను సందర్శించాలంటే బోటు అవసరమని చెప్పాడు. వీడియోను షేర్ చేయగానే కొంత మంది శుభాకాంక్షలు చెప్పగా, మరి కొంత మంది అతడిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. నాలా నీటితో ద్వీపం నిండిపోయిందని ఓ నెటిజన్ తెలిపాడు. అద్భుతం అని ఓ సోషల్ మీడియా యూజర్ పేర్కొన్నాడు. మికా సింగ్ చివరగా రియాలిటీ షో ‘స్వయంవర్’  (Swayamvar) లో కనిపించాడు. ఈ షోను సింగర్ షాన్ హోస్ట్ చేశాడు. స్టార్ భారత్‌లో ప్రసారమయింది. 12 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా వారిలో నుంచి తన జీవిత భాగస్వామిని మికా సింగ్ ఎన్నుకున్నాడు. ఆకాంక్ష పూరి (Akanksha Puri) ఈ షో విజేతగా నిలిచింది. మికాకు భవిష్యత్ భార్యగా ఎంపికయింది. ఆకాంక్ష అనేక టీవీ షోస్‌లో నటించింది. దక్షిణాది సినిమాల్లోను కనిపించింది. గణేశా సిరీయల్‌లో పార్వతి‌గా నటించి ఫేమ్‌ను సంపాదించుకుంది. 



Updated Date - 2022-09-30T21:44:08+05:30 IST