పూర్ణ ‘బ్యాక్ డోర్’ తీసే తేదీ మారింది

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో.. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లుగా రీసెంట్‌గా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర విడుదలను వాయిదా వేయడం జరిగిందని తెలుపుతూ.. ఫ్రెష్‌గా డిసెంబర్ 18న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. 


ఈ సందర్బంగా ఈ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ ‘బ్యాక్ డోర్" చిత్రానికి గల క్రేజ్‌కి తగ్గట్టు.. భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు థియేటర్లు లభ్యం కానందున ఈనెల 3 బదులుగా ఈనెల 18న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం..’’ అని తెలిపారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.