పూనమ్‌ బజ్వా.. ఇన్‌స్టాలో వేడెక్కిస్తోంది

‘సేవల్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భామ పూనమ్‌ బజ్వా. ఈ మూవీ తర్వాత ‘అరణ్‌మనై-2’, ‘తెనావట్టు’ వంటి చిత్రాల్లో నటించింది. కుటుంబ పాత్రలకు చూడచక్కని హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. అదేసమయంలో అభిమానుల్లోనూ తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకుంది. టాలీవుడ్‌లో కూడా ఈ భామ మంచి గుర్తింపునే పొందింది. అయితే, గత కొంతకాలంగా ఈ అమ్మడుకు ఒక్కటంటే ఒక్క సినిమా ఛాన్సు కూడా రావడం లేదు. అదేసమయంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బరువు కూడా పెరిగిపోయింది. దీంతో ఆమెకు వచ్చే ఒకటి రెండు అవకాశాలు కూడా ఇతర హీరోయిన్లు తన్నుకుపోయారు. ఈ నేపథ్యంలో తన శరీర బరువును గణనీయంగా తగ్గించుకుని స్లిమ్‌గా తయారైంది. అదేసమయంలో తనలోని పూర్వ గ్లామర్‌ ఏమాత్రం తగ్గకుండా శరీరాన్ని మెయింటైన్‌ చేస్తుంది. తన ఇన్‌స్టా అకౌంట్‌లో హాట్‌హాట్‌గా దర్శనమిస్తూ.. ఎప్పటికప్పుడు తాజా ఫొటోలతో దర్శకనిర్మాతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ మార్పు తర్వాతైనా పూనమ్‌కు సినీ అవకాశాలు వస్తాయో లేదో వేచిచూడాల్సిందే.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.