Pooja hegde: ఐదు నిమిషాల్లో అవన్నీ చేసేస్తా..

‘వరుసగా ఆరు విజయాలు అందుకున్నారు మీరెంత అదృష్టవంతురాలో’... 

‘ఏ దృష్టిలో  మీరు అలా అన్నారు? కఠోర శ్రమ, పర్ఫెక్ట్‌ కథ ఎంచుకోవడం వల్ల కాదా? వాటితో పాటు దేవుడి దయ కూడా’

‘మన బంధం గురించి పబ్లిక్‌కు ఎప్పుడు చెబుదాం’ 

‘రక్షాబంధన్‌’ రోజున..

నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు పూజాహెగ్డే ఇచ్చిన సమాధానాలివి. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా సక్సెస్‌లో ఉన్న ఆమె తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పనిచేయాలన్న చిరకాల కోరికను బయటపెట్టారు పూజా. ఏదో ఒక రోజు ఆ కల నెరవేతుందని ఆమె అన్నారు. పూజా పంచుకున్న మరిన్ని ఆసక్తికరవిషయాలు... 


‘ఆచార్య’ సినిమా గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. కానీ, నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పగలను. నీలాంబరి సాంగ్‌ నాకెంతో ప్రత్యేకం. మీరంతా ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నా. అదొక విజువల్‌ వండర్‌. ఆ పాట చిత్రీకరణలో గడిపిన క్షణాలను మరచిపోలేను. చిరంజీవిగారు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చూసి, నన్ను అభినందిస్తూ ఓ మెసేజ్‌ పంపారు. మరింత కష్టపడి పనిచేయాలనే ఆయన సందేశం నాలో స్ఫూర్తి నింపింది. జనవరిలో విడుదల కానున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రం ఎపిక్‌ లవ్‌స్టోరీ. అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కింది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ గురించి ఒక్క మాటల్లో చెప్పడం కుదరదు. కన్నడస్టార్‌ యశ్‌ కన్నడ ఇండస్ర్టీ గర్వించేలా చేశాడు. 

ఎదుటివారితో ఏ సమస్య ఉండదు..


మ్యూజిక్‌ నా స్ట్రెస్‌బస్టర్‌. సంగీతం నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. నేను డల్‌గా ఉన్నప్పుడు ఎక్కువగా సంగీతం వింటుంటా. మనసులో ఏదీ పెట్టుకోకుండా ఏడవటం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఐదు నిమిషాల్లో ఇవన్నీ చేసి, మళ్లీ పనిలో నిమగ్నమవుతా. పని అంటే నాకు చాలా ఇష్టం. నిరంతరం పని చేయమన్నా చేస్తాను. తక్కువ నిద్రపోతూ ఎక్కువ ఫ్లైట్‌ జర్నీ చేస్తున్నా. అందుకు సినిమానే కారణం. నిరంతరం పనిలో ఉండటం వల్ల తక్కువ మాట్లాడతాం. దాని వల్ల ఎదుటివారితో ఏ సమస్య ఉండదు. సెట్‌లో ఎదురైన సమస్యలను ఇంటి వరకూ తీసుకెళ్లను. ఒకప్పటితో పోల్చితే ఆ విషయంలో చాలా బెటర్‌ అయ్యాను. 

ఏ అవకాశం దక్కలేదు..

కెరీర్‌ బిగినింగ్‌లో నాకు సక్సెస్‌లు లేదు. ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని రోజులు ఏ అవకాశం దక్కలేదు. పనిపై మనసు పెట్టి కష్టపడితే అదే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్యాన్‌ ఇండియా చిత్రాల్లో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. కరోఠ శ్రమకు ప్రత్యామ్నాయం ఉండదని మా నాన్న దగ్గర నేర్చుకున్నా. అదే ఫాలో అవుతా. ఇంట్లో ఫుడ్‌ ఐటెమ్స్‌ మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తా. నేను ఎన్ని రకలు తయారు చేసినా మా అమ్మ చేసినట్లు ఏదీ ఉండదు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.