నితిన్‌ జోడీగా బుట్టబొమ్మ!

ABN , First Publish Date - 2021-07-08T00:49:06+05:30 IST

నితిన్‌ హీరోగా తదుపరి ఏ సినిమా రూపొందనుందనే దానిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ రైటర్‌, డైరెక్టర్‌ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట..

నితిన్‌ జోడీగా బుట్టబొమ్మ!

నితిన్‌ హీరోగా తదుపరి ఏ సినిమా రూపొందనుందనే దానిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ రైటర్‌, డైరెక్టర్‌ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో నితిన్ జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందట. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే కోసం భారీ రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌లో చేయబోతున్నారు. బన్నీతో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ తెరకెక్కించనున్న రెండో చిత్రమిది. మరో వైపు నితిన్‌ బాలీవుడ్‌ మూవీ 'అందాధున్‌' రీమేక్‌ 'మాస్ట్రో' సినిమాతో ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

Updated Date - 2021-07-08T00:49:06+05:30 IST